అంకుల్‌.. ఇదేనా అభివృద్ధి?

3 May, 2018 08:16 IST|Sakshi

కృష్ణా జిల్లా : అంకుల్‌... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మచిలీపట్నం అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయలేదు. పంటలకు సాగునీరు ఇస్తానని చెప్పారు... పోలవరం ప్రాజెక్ట్‌కు పూర్తి చేస్తారని చెప్పి నాలుగేళ్లైంది. ఇంత వరకు పూర్తి చేయలేదు. ఈప్రాంతంలో గతంలో రెండుపంటలు పండించేవారు. ఈ ఏడాది కేవలం ఒకపంటమాత్రమే పండించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.’ అని మచిలీపట్నానికి చెందిన చిన్నారి కొట్టు శ్రావణి జననేత జగన్మోహనరెడ్డి ముందు ధైర్యంగా మాట్లాడి అబ్బురపరిచింది. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. చంద్రబాబు అమరావతిని అభివృద్ధి చేస్తానని చెప్పి నేటికీ ఒక్కభవనం కూడా నిర్మించలేక పోయారని శ్రావణి వైఎస్సార్‌సీపీ అధినేతకు వివరించడం విశేషం.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు