శ్రీవారిని దర్శించుకున్న రంగరాజన్‌ స్వామి

23 Nov, 2019 14:00 IST|Sakshi

సాక్షి, తిరుమల : చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌ స్వామి శనివారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వంశపారంపర్య వ్యవస్థను తిరిగి కొనసాగించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొన్న నిర్ణయంపై రంగరాజన్‌ హర్షం వ్యక్తం చేశారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి సన్నిధి గొల్లలని కూడా వంశపారంపర్యం కొనసాగించాలని కోరారు. గత ప్రభుత్వం అవగాహనా లోపంతో అర్చకులను పదవీ విరమణ చేయించిందని, హైకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిందని పేర్కొన్నారు. తిరుమలలో ప్రస్తుతమున్న నాలుగు కుటంబాలలో ఇద్దరి చొప్పున ప్రధాన అర్చకులుగా నియమిస్తే, న్యాయపరమైన సమస్యలు కూడా ఉండవని సూచించారు. టీటీడీపై భక్తులకున్న మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించరాదని మీడియాకు విజ్ఞప్తి చేశారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పాఠశాలల్లో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడంపై స్పందిస్తూ.. తెలుగు మీడియమా? ఇంగ్లీష్‌ మీడియమా? అన్నది ముఖ్యం కాదు. విలువలతో కూడిన విద్య ముఖ్యం. పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలలో వారి భాషలోనే న్యాయస్థానాలు, ప్రభుత్వ కార్యకలాపాలు నడుస్తాయని గుర్తు చేశారు. ప్రస్తుత సమాజానికి తెలుగు, ఇంగ్లీష్‌ రెండూ ముఖ్యమేనని అభిప్రామపడ్డారు. 

మరిన్ని వార్తలు