విశాఖలో భూకుంభకోణం వాస్తవం

24 Jun, 2017 01:55 IST|Sakshi
విశాఖలో భూకుంభకోణం వాస్తవం
హోం మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప
 
తిరుపతి (అలిపిరి): విశాఖలో 300 ఎకరాలకు సంబంధించి భారీ భూ కుంభకోణం జరిగిందని వాస్తవాలు కూడా వెలుగులోకి తెచ్చింది కూడా రాష్ట్రప్రభుత్వమేనని రాష్ట్ర హోం శాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన వీఐపీ బ్రేక్‌లో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ టీటీడీ విద్య, వైద్య రంగాల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. తిరుపతి నగరం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుందన్నారు. టీటీడీ పాలకమండలి ఏర్పాటు చేయాల్సి వుందని, ఈసారి పాలకవర్గంలో నాన్‌  పొలిటీషియన్‌కు స్థానం కల్పించాలని సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయించారని తెలిపారు.

ప్రజాప్రతినిధులకు కూడా అవకాశం కల్పిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తిరుమలలో భక్తులకు మరింత మెరుగైన సేవలందేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు. శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని,అ ందుకు తగ్గట్టుగా టీటీడీ ఏర్పాట్లు చేస్తూ ముందుకు పోవడం అభినందనీయమన్నారు.
మరిన్ని వార్తలు