సినిమాలపై మక్కువతో ఉద్యోగం వదులుకున్నా

19 Sep, 2014 02:36 IST|Sakshi
సినిమాలపై మక్కువతో ఉద్యోగం వదులుకున్నా

 వర్ధమాన తార అశ్వనీ అగర్వాల్ సంప్రదాయం, ఆధునికతతో పాటు చలాకీ, చురుకైన అమ్మాయి పాత్రలు చేయాలని ఉందని సినీనటి అశ్వనీ అగర్వాల్ అన్నారు. సన్నజాజి మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై శ్రీనువర్మ, బంగారుబాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లాలి జో లాలి’ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు గురువారం ఆమె పాలకొల్లు వచ్చారు. ఈ సందర్భంగా అశ్వనీ అగర్వాల్‌తో చిట్‌చాట్.


 
  మీ స్వస్థలం ఏది
  మాది హైదరాబాద్. పుట్టి, పెరిగింది, చదువు అంతా హైదరాబాద్‌లోనే.
 
  తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు
  నాన్న శ్రీనివాస్ సెంట్రల్ ఎక్సైజ్‌లో సూపరింటెండెంట్. అమ్మ రమ గృహిణి.
 
  ఏం చదివారు
 నేను ఎన్‌ఐటీ స్టుడెంట్‌ని. వరంగల్ ఎన్‌ఐటీలో ఈఈఈ చేశా. బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఎగ్జిక్యూటివ్‌గా క్యాంపస్ సెలక్షన్‌లో ఎంపికయ్యా. అయితే సినిమాలు, మోడలింగ్‌పై ఉన్న మక్కువతో ఆ ఉద్యోగం వదులుకున్నా.
 
 చిత్రరంగం వైపు మొగ్గు చూపడానికి కారణాలేమిటి
  మొదట్నుంచీ మోడలింగ్, సినిమాలంటే ఇష్టం. తల్లిదండ్రులు చదువుకి ప్రాధాన్యత ఇవ్వమన్నారు. చదువు పూర్తికాగానే సినిమాలో అవకాశాలొచ్చాయి.
 
  ప్రస్తుతం ఏయే సినిమాలు చేస్తున్నారు
  లాలి జో లాలితో పాటు బీటెక్ బాబులు సినిమాలో నటిస్తున్నా. మారుతి దర్శకత్వంలో ‘నేల, బెంచి, బాల్కని’లో నటిస్తున్నా. ఎస్‌ఎస్ సెల్యులాయిడ్స్ శ్రీరామమూర్తి దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో ప్రధానపాత్ర పోషిస్తున్నా. ఈ సినిమా షూటింగ్ బ్యాంకాక్‌లో ఈ నెల 30 నుంచి వచ్చే నెల 20 వరకు జరగనుంది.  
 
  మీకు రోల్ మోడల్ ఎవరు
  తమన్నా. తమిళంలో మొదట చిన్న పాత్ర చేసింది. ఈ రోజు పెద్ద స్టార్‌గా ఎదిగింది.
 
  నటనలో ఏమైనా శిక్షణ తీసుకున్నారా
 వైజాగ్‌లో సత్యానంద్ వద్ద యాక్టింగ్‌లో ప్రత్యేక శిక్షణ పొందా.
 
 ఎటువంటి పాత్రలు చేయడానికి  ఇష్టపడతారు
  ప్రేక్షకులు ఆదరించే ఏ పాత్ర చేయడానికైనా సిద్ధమే. చలాకీ, చురుకైన అమ్మాయి పాత్ర చేయాలని ఉంది.
 

>
మరిన్ని వార్తలు