జాతీయ భావాలే బీజేపీ వైపు నడిపించాయి

7 Dec, 2013 23:46 IST|Sakshi
జాతీయ భావాలే బీజేపీ వైపు నడిపించాయి

 వ్యవసాయ కుటుంబం
 మాది సాధారణ వ్యవసాయ కుటుంబం. నాన్న స్వామిరెడ్డి, అమ్మ ఆండాళమ్మ.  నాతోపాటు నలుగురు సంతానం. మా మేనమామకృు సంతానం లేకపోవడంతో నన్ను పెంచుకున్నారు. దీంతో నా బాల్యమంతా ఇబ్రహీంపట్నం మండలం చర్లపటేల్‌గూడలో సాగింది. అక్కడే ప్రాథమిక విద్యనభ్యసించా. ఆ తర్వాత ఇబ్రహీంపట్నంలో హైస్కూల్‌లో టెన్త్ పూర్తి చేశా. యాకుత్‌పురాలోని ధర్మవంత్ కాలేజీలో ఇంటర్, టూల్ డిజైనింగ్‌లో డిప్లొమా చేశా.
 
 రాజకీయాలంటే ఆసక్తి
 విద్యార్థి దశ నుంచే రాజకీయాలంటే ఆసక్తి. టెన్త్‌క్లాస్‌లోనే సాంస్కృతిక విభాగం కన్వీనర్‌గా పనిచేశా. ఇంటర్‌లో కార్యదర్శిగా గెలిచా. ఆ తర్వాత డిప్లొమా కోర్సు  చేసేటప్పుడు విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యా. సామాజిక సేవ చేయాలనే తపనతో ఎన్‌సీసీ క్యాడెట్‌గా చేరి.. కెప్టెన్‌గా వ్యవహరించా. అక్కడి నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించా. బీజేపీ యువమోర్చా రంగారెడ్డి జిల్లా కన్వీనర్‌గా పనిచేశా.
 
 పార్టీ ఆఫీసులో 16 ఏళ్లు
 నా జీవితమంతా పార్టీ సేవలోనే గడిచింది. కాలేజీ రోజుల్లో.. ఆ తర్వాత కూడా పార్టీ కార్యాలయమే నా నివాసం. దాదాపు 16 ఏళ్లు బర్కత్‌పురాలోని పార్టీ ఆఫీసే నా కేరాఫ్ అడ్రస్. ఇక ఇప్పుడంటారా.. ఉదయం 8.30 గంటలకు జొన్న రొట్టె తిని బయటకొస్తా.  11 గంటల వరకు నియోజకవర్గంలో పర్యటించడం.. సమస్యలను తెలుసుకోవడం తొమ్మిదేళ్లుగా చేస్తున్నా. ఆ తర్వాత పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నమవుతా. బయటే మధ్యాహ్న భోజనం. కుదిరితే రాత్రి ఇంట్లో మరోసారి రొట్టెతో భోజనం ముగిస్తా. నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకే నా తొలి ప్రాధాన్యత. ఆ తర్వాత ఇతర పనులు.
 
 షోలే.. భలే
 చదువుకునే రోజుల్లో అడపాదడపా సినిమాలు చూసేవాణ్ణి. నాకు బాగా నచ్చిన చిత్రం ‘షోలే’. మూడుసార్లు చూశాననుకుంటా. తెలుగు సినిమాల విషయానికొస్తే అల్లూరి సీతారామరాజు. ఇప్పుడు సినిమాలు చూసే టైమ్ దొరకడం లేదు. దీంతో అటువైపు కన్నెత్తి కూడా చూడడంలేదు.
 
 ‘గుండె’ బరువెక్కింది
 హృద్రోగంతో చిన్నారులు మరణించడం నన్ను కలచివేసింది. బాధిత కుటుంబాలకు చేయూతనివ్వాలని నిర్ణయించుకున్నా. ఆలోచన వచ్చిందే తడ వుగా మంద క ృష్ణతో కలిసి 3వేల మంది బాధితులతో ప్రత్యేక సభ ఏర్పాటు చేశా. ఈ సభ ప్రాంగణంలోనే ఓ చిన్నారి గుండె జబ్బుతో మరణించడంతో నా హ ృదయం బరువెక్కింది. ఈ అంశంపై ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవాలని బాధితులతో అక్కడే బైఠాయించాం. మా ఉద్యమానికి ప్రభుత్వం స్పందించడం... చిన్నారుల చికిత్సకు ఒప్పుకోవడం ఆనందాన్ని కలిగించింది. ఇప్పటివరకు దాదాపు 55వేల మందికి కొత్త జీవితాన్ని ప్రసాదించామనే త ృప్తి మిగిలింది.
 
 వెరీ హ్యాపీ..
 భారతీయ జనతా యువమోర్చా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తీవ్రవాదంపై ఢిల్లీలో ప్రత్యేక సదస్సు నిర్వహించా. దానికి అప్పటి ప్రధాని వాజ్‌పేయి హాజరయ్యారు. తీవ్రవాదంపై జరిగిన ఈ సదస్సుకు 150 దేశాల ప్రతినిధులు వచ్చారు. ఈ సదస్సు మరిచిపోలేని అనుభూతిని మిగిల్చింది.
 
 డబుల్ ధమాకా..
 రెండుసార్లు రాష్ట్ర బీజేపీకి రథసారథిగా ఎన్నికయ్యా. ఎమ్మెల్యే, ఫ్లోర్‌లీడర్‌గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ, అధిష్టానం మాటను కాదనలేకపోయా. రెండోసారి బీజేపీ పగ్గాలు తీసుకోవాలనే ఆదేశాలను శిరసావహించా. రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొం దడం చాలా ఆనందాన్ని కలిగించింది.  ప్రస్తు తం బీజేఎల్‌పీ నేతగానే కాకుండా... అంతర్జాతీయ తీవ్రవాద వ్యతిరేక యువజన మండలి (వైకాట్) చైర్మన్‌గా కూడా పనిచేస్తున్నా.  
 
 మోడీ.. నేను..ఔర్!
 యువమోర్చాలో పనిచే స్తున్నప్పుడు తొమ్మిదేళ్లు ఢిల్లీలోనే ఉన్నా. నేను, నరేంద్రమోడీ, గోవిందాచార్య ముగ్గురం ఒకే ఆవరణలో వేర్వేరు గదుల్లో ఉండేవాళ్లం. పార్టీ పటిష్టత, ప్రజా సమస్యలపై ప్రతి రోజూ ముగ్గురం చర్చించేవారు. మోడీ సీఎంగా గుజ రాత్‌కు వెళ్లిపోగా.. నేను రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చేశా.
 
 తీరిక దొరకడంలేదు
 నా భార్య కావ్య. గృహిణి. పాప వైష్ణవి.. ఇంటర్మీడియట్, తన్మయ్ సెవెన్త్ క్లాస్. చిన్నప్పుడు మేనమామ ఇంట్లో పెరగడంతో అమ్మానాన్నలకు దూరంగా ఉన్నాననే బెంగ ఉండేది. ఇప్పుడు రాజకీయాల్లో బిజీ కావడంతో ఫ్యామిలీకి సమయం కేటాయించలేకపోతుండడం దిగులు ఉంటుంది. సమీప బంధువుల ఇళ్లలో కార్యక్రమాలకు వెళ్లే తీరిక కూడా ఉండదు. ఇది నన్ను అసంతృప్తికి గురిచే స్తుంది. సంక్రాంతికి లేదా దసరా పండుగలకు సొంతూరుకు వెళ్లి కుటుంబ సభ్యులతో గడుపుతా. ఎన్ని పనులున్నా.. శ్రీరామ నవమి కోసం మాత్రం తిమ్మాపూర్‌కు పయనమవుతా.
 
 రేపటి గురించి ఆలోచించను
 ప్రత్యేకించి లక్ష్యం ఏమీ లేదు. రేపటి కోసం ఆలోచించను. ఈ పూట చేయాల్సిన పనిని అంకితభావంతో, చిత్తశుద్ధితో చేసేస్తా. ఒక రకంగా చెప్పాలంటే ఇదే నా లక్ష్యం. చివరి వర కూ పార్టీ కోసం శ్రమిస్తా. ప్రజలకు పార్టీ కార్యకర్తలకు అన్నివేళల్లో అందుబాటులో ఉంటా. అంబర్‌పేట ‘చే’ నంబర్ చౌరస్తాలో ఫై ్లఓవర్ కట్టించాలనేది నా కల.
 
 సమస్యలపై స్పందించండి..
 సమాజంలోని సమస్యలపై యువత  స్పందించాలి. పరిష్కారానికి ప్రభుత్వంతో యుద్దం చేయాలి. ఇదే నేను యువతకిచ్చే సందేశం. సేవాభావం ఉన్న వాళ్లు రాజకీయాల్లోకి రావాలి. దేశాన్ని ఆదర్శవంతంగా తీర్చే బాధ్యత యువత చేతుల్లోనే ఉంది. రాజకీయాలు కలుషితమయ్యాయి అనే బదులు.. వాటిని ప్రక్షాళన చేసేందుకు నడుంబిగిస్తే మంచిది.
 

మరిన్ని వార్తలు