’టీటీడీలో ఆడిట్‌ అధికారులను నియమించాలి’

13 May, 2019 12:39 IST|Sakshi

సాక్షి, తిరుపతి : టీటీడీ అక్రమాలపై రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌కు మాజీ ఎంపీ చింతా మోహన్‌ లేఖ రాశారు. టీటీడీలో తక్షణమే ఆడిట్‌ అధికారులను, ఒక ఐఆర్‌ఎస్‌ అధికారిని నియమించాలని కోరారు. టీటీడీ సభ్యులు కుప్పం నుంచి వచ్చే కూరగాయలను అధిక రేట్లకు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక రైతుల నుంచే కూరగాయలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

టీటీడీ గోల్డ్‌ డిపాజిట్‌ తరలింపుకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి ఉందా అని ప్రశ్నించారు. తిరుమల, తిరుపతిలో వడ్డీ వ్యాపారులు ప్రజల్ని దోచుకుంటున్నారని, పోలీసులు, విజిలెన్స్‌ అధికారులు ఇందులో భాగస్వాములుగా ఉన్నారని ఆరోపించారు. ఈ విషయాలు అన్ని గవర్నర్‌, డీజీపీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈ నెల 23లో టీటీడీ స్పందించకపోతే ప్రత్యేక్ష ఆందోళన చేస్తానని హెచ్చరించారు.

>
మరిన్ని వార్తలు