చంద్రబాబు ప్రజాద్రోహి

25 Jan, 2015 02:50 IST|Sakshi
చంద్రబాబు ప్రజాద్రోహి

ఏడు నెలల్లోనే ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకత
పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
ముఖ్యమంత్రిగా చంద్రబాబు జిల్లాకు చేసింది శూన్యం  - ఎంపీ మిథున్‌రెడ్డి

 
 వాల్మీకిపురం:  ముఖ్యమంత్రి  చంద్రబాబునాయుడు ప్రజాద్రోహి అని వై ఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్య       దర్శి,  పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు.  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎం పీ మిథున్‌రెడ్డి శనివారం పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా వీరికి చింతల రామచంద్రారెడ్డి ఘనస్వాగతం పలికారు. అనంతరం   విలేకరుల సమావేశంలో  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రజలను మ్యాజిక్ మాటలతో నమ్మించి గద్దెనెక్కి లాజిక్కులతో చంద్రబాబునాయుడు మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను డొంకతిరుగుడు లేకుండా ఓక్కటైనా అమలు చేశారా? అని ప్రశ్నిం చారు. ఏడునెలల కాలంలోనే  ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు చరిత్రలో నిల చిపోతారని విమర్శించారు. ప్రభుత్వపాలనపై ప్రజల్లో నిరాశ కనిపిస్తుందన్నారు. రైతుల బంగారు వేలం ప్రకటనలు చూసినప్పుడల్లా గుండె తరుక్కుపోతోందని తెలిపారు.

బ్యాంకు అధికారులు రైతుల బంగారు వేలానికి  కొంత సమయం ఇవ్వాలని  కోరారు. ఎంపీ మిథన్‌రెడ్డి మాట్లాడుతూ  చంద్రబాబునాయుడు జిల్లా అభివృద్ధిని పట్టించుకోవడం లేదని  విమర్శించారు. పడమటి మండలాల్లో పశు వులు గడ్డి, నీరు లేక, ప్రజలు, రైతులు తాగునీరు, సాగునీరు లేక తీవ్ర ఇబ్బం దులు పడుతున్నా సీఎంకు కనిపించ డంలేదని విమర్శించారు. పేదల అ భ్యున్నతి కోసమే వైఎస్సార్ సీపీ పనిచేస్తోందన్నారు. ప్రభుత్వ  పాఠశాలల్లో నూతనంగా ప్రవేశపెడుతున్న క్లస్టర్ విధానం సరైంది కాదని తెలిపారు. ఈ విధానం అమలులోకి వస్తే గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలు చదువుకు దూరమవుతారని తెలిపారు. బీఈడీచదివి న వారికి ఉద్యోగాలు తగ్గి నిరుద్యోగ సమస్య మరింత పెరుగుతుందన్నారు. ఈనిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోకపోతే పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
 
 

మరిన్ని వార్తలు