మే 29 వరకు ఎన్నికల నియమావళి అమలు

23 Apr, 2018 11:30 IST|Sakshi
కలెక్టర్‌ ప్రద్యుమ్న

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు మే 29వ తేదీ వరకు ఎన్నికల నియమావళి అమల్లో ఉంటుందని కలెక్టర్‌ ప్రద్యుమ్న తెలిపారు. ఆదివారం ఆయన కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ను శనివారం సాయంత్రం జారీ చేసిందన్నారు. జిల్లాలో ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న కారణంగా ఎలాంటి అధికారిక శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయరాదన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజ కీయ నాయకులు, ప్రజలు సహకరిం చాలని కోరారు.

ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు చట్టపరంగా చర్యలు తీసు కుంటామని హెచ్చరించారు. ఎన్నికలను పకడ్బందీగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. స్థానిక సం స్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు 1,163 మంది స్థానిక ప్రజాప్రతినిధులు ఓటర్లుగా ఉంటారన్నారు. అందులో జెడ్పీటీసీలు 65 మంది, ఎంపీటీసీలు 884, చిత్తూరు మున్సిపల్‌ కార్పొరేటర్లు 49 మంది, శ్రీకాళహస్తి మున్సిపాలిటీ కౌన్సిలర్లు 34 మంది, మదనపల్లె మున్సిపల్‌ కౌన్సిలర్లు 33 మంది, పుంగనూరు మున్సిపల్‌ కౌన్సిలర్లు 24 మంది, నగరి కౌన్సిలర్లు 27 మంది, పలమనేరు కౌన్సిలర్లు 24 మంది, పుత్తూరు కౌన్సిలర్లు 23 మంది ఓటర్లుగా ఉంటారన్నారు. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు రిటర్నింగ్‌ అధికారిగా జిల్లా సంయుక్త కలెక్టర్‌ వ్యవహరిస్తారని తెలియజేశారు. 

మరిన్ని వార్తలు