పారదర్శకంగానే గ్రామ సచివాలయ నియామకాలు

25 Aug, 2019 07:03 IST|Sakshi
చిత్తూరు ఎస్పీ అప్పలనాయుడు

సోషల్‌ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే చర్యలు

చిత్తూరు ఎస్పీ అప్పలనాయుడు హెచ్చరిక

సాక్షి, చిత్తూరు అర్బన్‌: జిల్లాలో జరగనున్న గ్రామ, వార్డు సచివాలయాల పోస్టుల భర్తీ పారదర్శకంగా జరుగుతుందని, ఇందులో ఎలాంటి సందేహాలూ వద్దని చిత్తూరు ఎస్పీ చింతం వెంకట అప్పలనాయుడు స్పష్టం చేశారు. ఈ పోస్టుల్లో అక్రమాలకు, దళారులకు తావుండకూడదని ఇ ప్పటికే ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో పాటు స్వయంగా పర్యవేక్షిస్తున్నారన్నారు. కొందరు వ్యక్తులు ప్రముఖలను లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో సచివాలయ పోస్టులపై దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

తప్పుడు పోస్టులు పెడుతున్న వారిని గుర్తించడానికి ఓ బృందాన్ని నియమించామన్నారు. వాట్సప్, ఎఫ్‌బీ గ్రూపుల్లో ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తే అడ్మిన్‌ బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల నియామకం జరుగుతుందని, ప్రతి పరీక్ష కేంద్రం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పోస్టులు ఇప్పిస్తామని నమ్మించే ప్రయత్నం చేసినా, తప్పుడు ప్రచారాలు ట్రోల్‌ చేసినా డయల్‌–100, పోలీస్‌ వాట్సప్‌ నెంబరు– 9440900005కు ఫిర్యాదు చేయాలని కోరారు. 

మరిన్ని వార్తలు