క్రిమినల్స్‌ను ఏరిపారేద్దాం..!

1 Aug, 2019 09:18 IST|Sakshi

సాక్షి, చిత్తూరు : ‘చిత్తూరు అనేది ఇంటర్‌ స్టేట్‌ బోర్డర్‌. తమిళనాడులోని వేలూరుకు దగ్గరగా ఉన్న ప్రాంతం. మన దగ్గర 11 సరిహద్దు పోలీస్‌ స్టేషన్లు ఉంటే.. వేలూరు పరిధిలో 8 స్టేషన్లు ఉన్నాయి. మనందరిదీ ఒక్కటే కాన్సెప్ట్‌. క్రిమినల్స్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మా వద్ద నమోదైన కేసుల్లో మోస్ట్‌ వాటెండ్‌ క్రిమినల్స్‌ తమిళనాడులో ఉన్నారు. వాళ్లను మాకు అప్పగిస్తే పెండింగ్‌ కేసులు క్లోజ్‌ అవుతాయి. అలాగే మా వద్ద ఎవరైనా ఉంటే మేమూ సహకరిస్తాం.

అప్పుడే క్రిమినల్స్‌ను ఏరిపారేయడానికి వీలవుతుంది..’ అని చిత్తూరు ఎస్పీ వెంకట అప్పలనాయుడు పేర్కొన్నారు. చిత్తూరు, తమిళనాడు అంతరాష్ట్ర సరిహద్దు నేర సమీక్షా సమావేశం బుధవారం చిత్తూరులోని పోలీసు అతిథిగృహంలో నిర్వహించారు. ఈ సమావేశానికి వేలూరు ఎస్పీ ప్రవేష్‌కుమార్, చిత్తూరు ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ నాగలక్ష్మి, తమిళనాడుకు చెందిన పలువురు డీఎస్పీలు పాల్గొన్నారు. ఎస్పీ అప్పలనాయుడు మాట్లాడుతూ జిల్లాలో నమోదైన ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసుల్లో న్యాయస్థానం జారీ చేసిన అరెస్టు వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.

వారిని తమకు అప్పగించడంలో తమిళనాడు పోలీసులు సహకరించాలన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో బియ్యం అక్రమ రవాణా, ఇతర స్మగ్లింగ్‌ను అరికట్టడానికి రెండు జిల్లాల పోలీసులు సమన్వయంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే సారాపై ఉక్కుపాదం మోపాలని.. దీంతో చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. పేరుమోసిన క్రిమినల్స్‌పై నిత్యం నిఘా ఉంచడం వల్ల నేరాలు జరగకుండా ముందుగానే నియంత్రించవచ్చన్నారు.

వేలూరు ఎస్పీ ప్రవేష్‌కుమార్‌ మాట్లాడుతూ ఈనెల 5వ తేదీ వేలూరు ఎంపీ స్థానానికి ఎన్నిక జరగనున్న నేపథ్యంలో చిత్తూరు పోలీసుల సాకారం కావాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం లేకుండా చూడటంతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచడం, అక్రమ మద్యం, సారాను నియంత్రించడానికి సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో చిత్తూరు ఏఎస్పీ కృష్ణార్జునరావు, జిల్లాకు చెందిన డీఎస్పీలు ఈశ్వర్‌రెడ్డి, అరీఫుల్లా, గిరిధర్, వేలూరు జిల్లా డీఎస్పీలు పళనిసెల్వం, రాజేంద్రన్, శరవనన్, మురళి, ప్రశాంత్, తేరస్‌ పాల్గొన్నారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆగస్టు 8న జిల్లాకు ముఖ్యమంత్రి 

నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

రైతుల ఆత్మహత్యలకు కారణం చంద్రబాబే..

'చంద్రబాబు మళ్లీ సీఎం కాలేరు'

అనారోగ్యంతో గిరిజన విద్యార్థి మృతి

ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం

మహిళా రోగిపై అసభ్యకర ప్రవర్తన

వారి సంగతేంటో తేల్చండి..

ఈ చిన్నారికి ఎంత కష్టం 

రూ.25.86 లక్షల జరిమానా

సబ్‌ రిజస్ట్రార్‌ కార్యాలయంపై.. ఏసీబీ దాడి

నంద్యాల యువతి హైదరాబాద్‌లో కిడ్నాప్‌? 

అశోక్‌ లేలాండ్‌పై ఆగ్రహం

అక్టోబర్‌ 2 నుంచి అర్హులకు రేషన్‌ కార్డులు

విశాఖ అద్భుతం

చంద్రబాబుకున్న ‘జెడ్‌ ప్లస్‌’ను కుదించలేదు

‘నీరు– చెట్టు’ అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ ప్రారంభం 

నాయకత్వం లోపంతోనే ఓడిపోయాం

అమరావతిలో క్యాన్సర్‌ ఆస్పత్రి ఏర్పాటు చేయాలి

ఎమ్మెల్సీ వాకాటి ఇంట్లో సీబీఐ సోదాలు

స్థిరాస్తులకు కొత్త రేట్లు

టీడీపీ సర్కార్‌ పాపం వైద్యులకు శాపం..!

వాన కురిసే.. సాగు మెరిసే..

బిరబిరా కృష్ణమ్మ.. గలగలా గోదావరి

27 మంది ఖైదీలకు ఎయిడ్సా?

జగన్‌ది జనరంజక పాలన

మీ అందరికీ ఆల్‌ ద బెస్ట్ : సీఎం జగన్‌

విశాఖలో పర్యటించిన గవర్నర్‌ బిశ్వ భూషణ్‌

ఈనాటి ముఖ్యాంశాలు

కోకోనట్‌ బోర్డు సభ్యురాలిగా వైఎస్సార్‌సీపీ ఎంపీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హీరో కథా చిత్రాల్లో నటించమంటున్నారు

బెల్లంకొండపై..అరెస్ట్‌ వారెంట్‌

శ్రీదేవి కల నెరవేరనుందా?

మళ్లీ బిజీ అవుతున్న సిద్ధార్థ్‌

అలాంటి సినిమాల్లో అస్సలు నటించను : రష్మిక

హీరోపై సినీనటి తల్లి ఫిర్యాదు..