‘టిక్ టాక్’ కోసం అడవులకు వెళ్లి..

29 Jul, 2019 20:30 IST|Sakshi

సాక్షి, చంద్రగిరి: టిక్ టాక్ మోజు ఓ విద్యార్థిని అడవి పాలు చేసింది. శేషాచలం అడవుల్లో టిక్ టాక్ చేస్తూ ఓ విద్యార్థి దారి తప్పాడు. చివరికి పోలీసుల సహాయంతో బయటపడ్డాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో చోటుచేసుకుంది.

కలకడ మండలం మంగళపల్లి గ్రామానికి చెందిన మురళికృష్ణ శ్రీవిద్యానికేతన్‌లో మైక్రోబయాలజీ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. టిక్ టాక్ మోజులో పడ్డ మురళికృష్ణ ఆదివారం ఉదయం శేషాచలం అడవుల బాట పట్టాడు. అడువుల్లో ఓ కొండపైన జాతీయ జెండాను నుంచి వందనం చేశాడు. సాయంత్రం తిరిగి వచ్చే సమయంలో చీకటి పడటంతో దారి తప్పిపోయాడు. ఎటు వెళ్లాలో తెలియక అవస్థలు పడ్డాడు. దారి తప్పి  తిరుగుతున్న మురళికృష్ణ తన స్నేహితులకు లొకేషన్ షేర్ చేశాడు. మూర్ఛ వ్యాధితో సృహతప్పి పడిపోయాడు‌. మురళికృష్ణ అడవిలో చిక్కుకుపోయిన విషయాన్ని అతడి స్నేహితులు పోలీసులకు తెలిపారు. చంద్రగిరి పోలీసులు అర్ధరాత్రి మురళికృష్ణ రక్షించడానికి అటవీ అధికారులతో కలిసి అడవిలో జల్లెడ పట్టారు. సోమవారం తెల్లవారుజామున ఆచూకీ గుర్తించి పోలీసులు అతడిని రక్షించారు. వైద్యం కోసం పోలీసులు మురళికృష్ణను రుయా ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు