సీఏ ఫైనల్‌లో మోహన్‌కు రెండో ర్యాంక్

18 Jan, 2016 01:57 IST|Sakshi

శ్రీకాళహస్తి/విజయవాడ (లబ్బీపేట): చిత్తూరు జిల్లా తొట్టంబేడు వుండలంలోని చోడవరం గ్రావూనికి చెందిన నాగోలు మోహన్‌కువూర్ సీఏలో ఆల్ ఇండియూ రెండో ర్యాంకును సాధించారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెన్సీ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ఆదివారం సీఏ ఫైనల్ పరీక్ష ఫలితాలు ప్రకటించింది. ఫలితాల్లో మోహన్‌కుమార్ జాతీయస్థాయిలో ప్రతిభ చూపి రెండోర్యాంకు కైవసం చేసుకున్నారు. విజయవాడలోని సూపర్‌విజ్‌లో మోహన్‌కుమార్ శిక్షణ పొందారు. సీపీటీ, ఐపీసీసీల్లో జాతీయస్థాయిలో తొమ్మిదో ర్యాంకును కైవసం చేసుకున్న మోహన్‌కుమార్.. సీఏ ఫైనల్లోనూ రెండో ర్యాంకుతో సత్తా చాటారు.

మొదటి ర్యాంకును తమిళనాడుకు చెందిన విద్యార్థి దక్కించుకోగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో మోహన్‌కుమార్‌దే అత్యుత్తమ ర్యాంకు కావడం విశేషం. మోహన్‌కుమార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ తన తల్లిదండ్రులు మంజుల, నాగరాజురెడ్డి వ్యవసాయ పనులు చేస్తుంటారని తెలిపారు. ఎంతో కష్టపడుతూ తనను చదివించారని, ఇప్పుడు సాధించిన జాతీయ ర్యాంకును తల్లిదండ్రులకే అంకితమిస్తున్నానని చెప్పారు. సూపర్ విజ్ శిక్షణతోపాటు తన అన్నయ్య భానుప్రసాద్ స్ఫూర్తిగా నిలిచాడన్నారు. శిక్షణ ఇచ్చిన సూపర్‌విజ్ ప్రిన్సిపాల్ సబ్బినేని వెంకటేశ్వరరావు మోహన్‌కుమార్‌ను అభినందించారు. తొట్టంబేడు గ్రామస్తులు కూడా హర్షం వ్యక్తం చేశారు.
 

మరిన్ని వార్తలు