అమానుషం.. ఖాకీల తీరు

25 May, 2018 12:54 IST|Sakshi
జీఎం వాహనానికి దారి ఇచ్చే క్రమంలో కార్మికులను పక్కకు లాగేస్తున్న పోలీసులు

మహిళా కార్మికులపై దురుసుగా వ్యవహరించిన సీఐ

చింతవరం సెంటర్‌లో రాస్తారోకో

చిల్లకూరు: తీర ప్రాంతంలోని చింతవరం సమీపంలో ఉన్న మాస్‌ అపెరల్‌ పార్కులో ఉన్న అక్షయ వస్త్ర పరిశ్రమలో పని చేసే కార్మికులు తమ డిమాండ్లను యాజమాన్యం పరిష్కరించడంలేదని గురువారం విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేసారు. ఈ సమయంలో వచ్చిన పోలీసులు కార్మికులతో చర్చలు జరిపే సమయంలో ఒక్క సారిగా గూడూరు రూరల్‌ సీఐ అక్కేశ్వరరావు మహిళా కార్మికులపై దురుసుగా వ్యవహరించడమే కాకుండా కొంత మంది మహిళలను పక్కకు లాగి వేయడంతో మనస్తాపం చెందిన కార్మికులు పరిశ్రమ నుంచి రెండు కీమీ దూరం నడిచి వచ్చి చింతవరం కూడలి ప్రాంతంలో రాస్తారోకో నిర్వహించారు. దీంతో సుమారు 8 గంటల పాటు తీర ప్రాంతంలోని 18 గ్రామాలకు వాహనాల రాక పోకలు నిలిచి పోయాయి. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ వారం రోజుల క్రితం జీతాలు పెంచాలని డిమాండ్‌ చేయడంతో పరిశ్రమ ప్రతినిధులు చర్చలు జరిపి ఐదు డి మాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చారన్నారు.

దీంతోనే బుధవారం విధులకు హాజరు కాగా గురువారం ఉదయం పరిశ్రమ జీఎం చమిందా వచ్చి ఇచ్చిన హామీలు నెరవేర్చడం సాధ్యం కాదని తెల్చారు. దీంతో కార్మికులు విధులను బహిష్కరించి డిమాండ్ల సాధనకు శాంతియుతంగా నిరసన చేస్తున్నామని తెలిపారు. ఈ లోగా యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు వచ్చిన సీఐ అక్కేశ్వరరావు మహిళా కార్మికులను దూషించడంతో పాటు ఎవరికి చెప్పుకుంటారో చెప్పకోండని పరిశ్రమ జీఎంకు భద్రత కల్పిస్తూ అడ్డు వచ్చిన మహిళలను పక్కకు లాగి వేయడమే కాకుండా తమపై దారుణంగా వ్యవహరించారని ఆరోపించారు. సీఐ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తూ పోలీసుల డౌన్‌ డౌన్‌ అంటూ ని నాదాలు చేసారు. అదే సమయంలో అటుగా వస్తున్న చిల్లకూరు పీఏ సీఎస్‌ అధ్యక్షుడు వేమారెడ్డి కుమారస్వామిరెడ్డికి తా ము పడుతున్న బాధలు చూడాలని విన్నవించారు. దీంతో ఆయన ఎమ్మెల్యేతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని అన్నారు.  రాస్తారోకో చేస్తున్న సమయంలో చిల్లకూరు, గూడూరు రూరల్, మనుబోలు ఎసైలు, శ్రీనివాసరావు, బాబీ, శ్రీనివాసరెడ్డిలతో పాటు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.

సీఐపై ఫిర్యాదు
మహిళా కార్మికులపై అనుచితంగా వ్యవహరిం చిన సీఐ అక్కేశ్వరరావుపై కేసు నమోదు చేయాలని కా ర్మికులు ఎస్సై శ్రీనివాసరావుకు రాత పూ ర్వక ఫిర్యాదును అందించారు. జీఎం చమిందాను పరిశ్రమ నుంచి బయటకు తీసుకెళ్లేటప్పుడు మహిళా కార్మికులను పక్కకు తొలగించే సమయంలో మహిళా కానిస్టేబుళ్లను వినియోగించకుండా తనే చేతలతో నెట్టి వేయడం ఏమిటని అలాగే అరుణ అనే మహిళా కార్మికురాలిపై లాఠీని ఝుళి ³ంచారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు