తుపాను బాధితులకు సినిమా రంగ ప్రముఖుల విరాళాలు

15 Oct, 2014 18:10 IST|Sakshi
తుపాను బాధితులకు సినిమా రంగ ప్రముఖుల విరాళాలు

హైదరాబాద్: హుదూద్ పెను తుపాను ఉత్తరాంధ్రలో బీభత్సం సృష్టించిన నేపధ్యంలో సినిమా రంగానికి చెందిన వారు వెంటనే స్పందించారు. నిర్మాతలు, దర్శకులు, హీరోలు, నటులు అందరూ నిన్నటి నుంచి బాధితుల కోసం విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈ రోజు తాజాగా మరి కొందరు విరాళాలు ప్రకటించారు. దర్శకులు వివి వినాయక్, త్రివిక్రమ్ శ్రీనివాస్, హీరో కళ్యాణ్ రామ్, హీరోయిన్ సమంత ఒక్కొక్కరు పది లక్షల రూపాయలు ప్రకటించారు. దర్శకుడు బోయపాటి శ్రీను ఏడు లక్షల రూపాయలు, రచయిత చిన్నికృష్ణ లక్షల రూపాయల నగదుతోపాటు ఐదు లక్షల విలువైన బియ్యం, తన పిల్లల పేరిట మరో యాభైవేల రూపాయలు, దర్శకుడు శ్రీను వైట్ల, హీరో గోపిచంద్,  హాస్య నటుడు సునీల్, హీరోయిన్ కాజల్ ఒక్కొక్కరు అయిదు లక్షల రూపాయలు ప్రకటించారు.  హాస్యనటుడు ఆలీ, నవీన్ చంద్ర, రాహుల్ ఒక్కొక్కరు లక్ష రూపాయలు విరాళాలు ప్రకటించారు. ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ (ఎఫ్ఎన్సీసీ) 10లక్షల రూపాయల చెక్ ని సీఎం రిలీఫ్ ఫండ్ కి అందించనున్నట్టు క్లబ్ అధ్యక్షుడు కె.ఎస్.రామరావు బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. అంతేకాక, ఎఫ్ఎన్సీసీకి చెందిన ఉద్యోగులు 350 మంది తమ ఒకరోజు వేతనాన్ని తుఫాను బాధితుల సహాయార్ధం అందించనున్నట్టు ప్రకటించారు.

ఇప్పటి వరకు విరాళాలు ప్రకటించిన వారు:
పవన్ కళ్యాణ్ రూ.50 లక్షలు
రామానాయుడు ఫ్యామిలీ రూ.50 లక్షలు
బాలకృష్ణ రూ.30 లక్షలు
సూర్య రూ.25 లక్షలు
మహేష్ బాబు రూ.25 లక్షలు
తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి రూ. 25 లక్షలు
ఎన్టీఆర్ రూ. 20 లక్షలు
అల్లు అర్జున్ రూ. 20 లక్షలు
రేణుదేశాయ్ రూ.20 లక్షలు
ప్రభాస్ రూ.20 లక్షలు
అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ రూ.20 లక్షలు

విశాల్ రూ.15 లక్షలు
రామ్‌చరణ్ రూ.15 లక్షలు
కార్తీ రూ.12.5 లక్షలు
జ్ఞాన్వేల్ రాజా రూ.12.5 లక్షలు
కృష్ణ రూ.15 లక్షలు
విజయనిర్మల రూ.10 లక్షలు
నితిన్ రూ.10 లక్షలు
రవితేజ రూ.10 లక్షలు
రామ్ రూ. 10 లక్షలు
వివి వినాయక్ రూ. 10 లక్షలు
త్రివిక్రమ్ శ్రీనివాస్ రూ. 10 లక్షలు
కళ్యాణ్ రామ్ రూ. 10 లక్షలు
సమంత రూ. 10 లక్షలు

బోయపాటి శ్రీను రూ7 లక్షలు
హరీశ్ శంకర్ రూ.3 లక్షలు
ప్రకాశ్రాజ్ రూ.5 లక్షలు
అల్లరి నరేష్ రూ.5 లక్షలు
శ్రీను వైట్ల రూ.5 లక్షలు
గోపిచంద్ రూ.5 లక్షలు
సునీల్ రూ.5 లక్షలు
కాజల్ రూ.5 లక్షలు
పాప్ గాయని స్మిత రూ.5లక్షలు

బ్రహ్మానందం రూ.3లక్షలు
సందీప్ కిషన్ రూ.2.5లక్షలు
సంపూర్ణేష్ బాబు రూ. లక్ష
రకుల్ ప్రీత్ రూ.లక్ష
నిఖిల్ రూ. 2 లక్షలు
పూరి ఆకాశ్ రూ. లక్ష 50 వేలు
ప్రతాప్ కొలగట్ల రూ. లక్ష
నందూ రూ. లక్ష
ఆలీ రూ. లక్ష
నవీన్ చంద్ర రూ. లక్ష
రాహుల్ రూ. లక్ష
రావురమేష్ రూ. లక్ష
రచయిత కోన వెంకట్ రూ. లక్ష
రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి ఎంపీ నిధుల నుంచి 50 లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు.
**

మరిన్ని వార్తలు