ఇల్లు స్వాధీనం చేయాలని సీఐ బెదిరిస్తున్నాడు

22 Mar, 2016 08:56 IST|Sakshi

గుంటూరు : ఇల్లు ఖాళీ చేసి వడ్డీకిచ్చిన వారికి అప్పగించాలని తాలుకా ఎస్‌హెచ్‌ఓ బెదిరిస్తున్నాడని ఓ మహిళ అర్బన్ ఎస్పీని ఆశ్రయించింది. ప్రభుత్వం అందించిన స్థలంలో ఇల్లు కట్టుకొని 13 ఏళ్ల నుంచి ఉంటున్నానని చెప్పింది. కరెంటు, ఇంటి పన్నులూ చెల్లిస్తున్నానని పేర్కొంది. వేళంగి నగర్‌కు చెందిన  ఉదగిరి నగదర్ వద్ద 2013లో 50 వేలు వడ్డీకి తీసుకున్నానని తెలిపింది. చెక్కులు, స్టాంపు ఖాళీ పేపర్లు తీసుకున్నాడంది.
 
అప్పకు సంబంధించి ఇల్లు స్వాధీనం చేయాలని తనపై దాడి చేసాడని వాపోయింది. ఫోన్‌లో ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో డీఎస్పీ కూడా వచ్చి విచారించారంది. ఐజీకి కూడా ఫిర్యాదు చేశానంది. గత వారం ఎస్పీకి ఫిర్యాదు చేయగా రూరల్ సీఐ పూర్ణచంద్రరావు వద్దకు పంపించారని తెలిపింది. ఇల్లు నగదర్‌కు స్వాధీనం చేయాలని సీఐ బెదిరిస్తున్నారని వాపోయింది. కోర్టు నుంచి ఆదేశాలందాయని సీఐ చెబుతున్నారేగానీ అవి తనకు చూపడం లేదని విలపించింది.
 
29 ఫిర్యాదుల స్వీకరణ
జిల్లా రూరల్ కార్యాలయంలో సోమవారం డీఎస్పీలు డి.సుధాకర్ ,సూర్యనారాయణ రెడ్డి గ్రీవెన్స్ నిర్వహించారు. 29 మంది నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. పలువురి సమస్యలపై వెంటనే స్పందించి ఫోన్‌లో ఎస్‌హెచ్‌ఓలకు తగిన ఆదేశాలిచ్చారు. కొందరి ఫిర్యాదులను పరిశీలించాల్సిందిగా లిఖిత పూర్వకంగా ఆదేశాలు అప్పటికప్పుడే పంపించారు.

>
మరిన్ని వార్తలు