నిలకడగా వైఎస్‌ జగన్‌ ఆరోగ్యం

31 Oct, 2018 04:54 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న వైద్యుడు

చేయి కదలికలు తగ్గించాలని డాక్టర్ల సూచన

సాక్షి, హైదరాబాద్‌ : ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆయన కోలుకుంటున్నారని సిటీ న్యూరో సెంటర్‌ వైద్యులు తెలిపారు. డాక్టర్లు సాంబశివారెడ్డి, చంద్రశేఖరరెడ్డి మంగళవారం జగన్‌ నివాసానికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. తాము సాధారణ పరీక్షలు నిర్వహించామని డ్రెస్సింగ్‌ కూడా చేశామని సాంబశివారెడ్డి తెలిపారు. ప్రస్తుతం జగన్‌ రక్తపోటు కూడా నిలకడగా ఉందన్నారు. అయితే, చేయి కదలినపుడల్లా బాగా నొప్పి వస్తోందని జగన్‌ చెబుతున్నారని అందుకే సాధ్యమైనంత వరకూ కదలికలను తగ్గించుకోవాలని సూచించామని తెలిపారు.

గాయం పూర్తిగా మానడానికి 3 నుంచి 6 వారాలు పడుతుందన్నారు. ఇదిలా ఉంటే.. రక్త పరీక్షల్లో ఎలాంటి విషపూరిత రసాయనాల ఆనవాళ్లూ లేవని తేలిందని, స్వల్పంగా అల్యూమినియం శాతం ఎక్కువగా ఉండటంతో మందులు ఇచ్చామని చంద్రశేఖరరెడ్డి అన్నారు. అయితే, ప్రతీ మూడు, ఆరు నెలలకు క్రమం తప్పకుండా అల్యూమినియం శాతం ఎంత ఉందో తెలుసుకోవడానికి రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.  

మరిన్ని వార్తలు