-

టీడీపీలో ‘యూ’ టెన్షన్‌ !

30 Jul, 2018 03:42 IST|Sakshi

ఆ పదం వింటేనే ఉలిక్కిపడుతున్న పార్టీ నాయకులు

హోదాపై కొద్దిరోజుల క్రితం ఉన్నట్టుండి రూటు మార్చిన చంద్రబాబు

సోషల్‌ మీడియాలో, బయటా బాబుపై సెటైర్లు, విమర్శలు

గూగుల్‌లో ‘యూటర్న్‌ అంకుల్‌’ అంటే బాబు ఫొటోలు ప్రత్యక్షం

‘యూటర్న్‌..’ పేరు వింటేనే టీడీపీ నేతలు కొద్ది రోజులుగా ఉలిక్కిపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే పది రోజులుగా ఆ పదం వాడకుండా ఏ సమావేశాన్ని ముగించడం లేదు. తాను యూటర్న్‌ తీసుకోలేదంటూ పార్టీ సమావేశాలు, టెలికాన్ఫరెన్స్‌ల్లో పదేపదే ప్రస్తావిస్తున్నారు. దీన్నిబట్టే ‘యూటర్న్‌’ టీడీపీని ఎంత కలవరపాటుకు గురి చేస్తోందో తెలిసిపోతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. –సాక్షి, అమరావతి


టర్నుల మీద టర్నులు
ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబు తీసుకున్న విభిన్న వైఖరులతో ఆయన ‘యూటర్న్‌’ల గురించి దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. గత ఎన్నికలకు ముందు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఐదేళ్లు సరిపోదని 15 ఏళ్లు కావాలని మోదీ సమక్షంలో కోరారు. తర్వాత బీజేపీతో కలసి అధికారాన్ని పంచుకుని హోదా అవసరం లేదని ప్రత్యేక ప్యాకేజీ అత్యుత్తమమని మాట మార్చారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి హోదానే కావాలంటూ మళ్లీ యూటర్న్‌ తీసుకున్నారు. హోదా కోసం పోరాడుతున్న యువతను బెదిరించిన నోటితోనే ప్రత్యేక హోదా కోసం పోరాడాలంటూ కొత్త పాట పాడుతున్నారు.  

‘యూటర్న్‌ అంకుల్‌’: తాను కారులో వెళ్తుంటే ఎక్కడ యూటర్న్‌ కనబడినా చంద్రబాబే గుర్తుకొస్తున్నారంటూ వైఎస్సార్‌ సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించిన అనంతరం చంద్రబాబు యూటర్న్‌ల గురించి జోరుగా ప్రచారం సాగుతోంది. ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇతర మాధ్యమాల్లో బాబు యూటర్న్‌పై అనేక వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. గూగుల్‌లో ‘యూటర్న్‌ అంకుల్‌’ అంటే చంద్రబాబు ఫొటోలు, యూటర్న్‌ సింబల్‌తో ఉన్న ఫొటోలు దర్శనమిస్తుండడం విశేషం. ఇటీవల ప్రధాని మోదీ సైతం లోక్‌సభలో మాట్లాడుతూ చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారని విమర్శించిన విషయం తెలిసిందే. దీంతో చంద్రబాబు బీజేపీపై ఎదురుదాడికి సిద్ధమయ్యారు.

40 ఏళ్లుగా బాబు యూటర్న్‌లు (సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి)
1978  - కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపు
1983  - కాంగ్రెస్‌ నుంచి పోటీచేసి ఓడిన తరువాత ఆ పార్టీకి ఝలక్‌ ఇచ్చి టీడీపీలోకి జంప్‌
1995  - సొంత మామ ఎన్డీఆర్‌కు వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీ లాక్కున్నాడు
1998  - యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌గా ఉండగానే యూటర్న్‌తో ఎన్డీఏలో చేరిక
1999  - బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ  
2004 - ఎన్నికల తర్వాత ఎన్డీఏకు హ్యాండ్‌ ఇచ్చి బయటకు వచ్చిన బాబు
2009 - టీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐలతో కలిసి పోటీ, ఎన్నికలయ్యాక ఆ పార్టీలకు ఝలక్‌
2014 - మళ్లీ ఎన్డీఏలో చేరిక  
2018 -మరోసారి ఎన్డీఏకు ఝలక్‌ ఇచ్చి బయటకు వచ్చారు


ప్రత్యేక హోదాపై బాబు యూటర్న్‌లు
2014  ఏప్రిల్‌ 29  -   మనకు ప్రత్యేక హోదా కావాలి. ఐదేళ్లే ఇస్తామంటున్నారు. 15 ఏళ్లు ఇవ్వాలని మోదీ గారిని కోరుతున్నా (తిరుపతి సభలో)  
2015 ఆగస్టు 25  -  ప్రత్యేక హోదా సంజీవని కాదు.  (ప్రధాని మోదీని కలిసిన తర్వాత ఢిల్లీలో)
2016 మే 17      -  హోదాతో ఏమొస్తుంది? హోదా ఉన్న ఈశాన్య రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయి?
2016 సెప్టెంబర్‌ 15 -     హోదాతో పరిశ్రమలు రావు. పారిశ్రామిక రాయితీలకు, హోదాకు సంబంధం లేదు.
2017 ఫిబ్రవరి 3    -  హోదా వేస్ట్‌. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాల్లో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు లేవు.
2018 మార్చి 2    -  రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దని టీడీపీ ఎప్పుడూ అనలేదు.
2018 మార్చి 10  -    కేంద్రంపై వైఎస్సార్‌ సీపీ పెట్టే అవిశ్వాసానికి మద్దతివ్వం.
2018 మార్చి 15  -    వైఎస్సార్‌సీపీ అవిశ్వాసానికి మద్దతిస్తాం.
2018 మార్చి 16 -     వైఎస్సార్‌ సీపీ పెట్టే అవిశ్వాసానికి మద్దతివ్వం. మేమే అవిశ్వాసం పెడతాం.
2018 మే       -     రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి.
2018 జూలై 25  -   ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి.

మరిన్ని వార్తలు