‘ఆ బిల్లులు 40 కోట్ల మంది కార్మికులకు వ్యతిరేకం’

2 Aug, 2019 14:13 IST|Sakshi

సాక్షి, విజయవాడ : కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందంటూ ధర్నా చౌక్‌లో అల్  ట్రేడ్ యూనియన్‌ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  గఫుర్ ఈ నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాసేలా పార్లమెంట్‌లో బిల్లులను ప్రవేశ పెట్టిందని పేర్కొన్నారు. 17 కార్మిక చట్టాలను రెండు లేబర్ కోడ్‌లుగా మార్చిందని, దీని వల్ల 13 కార్మిక చట్టాలు రద్దవుతాయని తెలిపారు. ఇది కార్మికుల హక్కులకు భంగం కలిగించేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అదే విధంగా రెండో చట్టమైన వేతనాల చట్టం వల్ల నాలుగు కార్మిక చట్టాలు రద్దు అవుతాయని అన్నారు. ఈ రెండు బిల్లులు దేశంలోని 40 కోట్ల మంది కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయని మండిపడ్డారు. లోక్‌సభలో ప్రవేశ పెట్టిన ఈ రెండు బిల్లులను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు