కాలువలో శవమై తేలిన పదోతరగతి విద్యార్థిని

24 Nov, 2013 08:39 IST|Sakshi

పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ప్రియాంక అనే పదో తరగతి విద్యార్థిని కాలువలో శవంగా తేలింది. ఈనెల 19వ తేదీ నుంచి ఆమె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. పాలకొల్లులోని ఇబ్రహిల్ ఎయిడెడ్ పాఠశాలలో ప్రియాంక పదో తరగతి చదువుతోంది.

ఈ దారుణ సంఘటనపై స్పందించిన పోలీసులు ఆమె ఉంటున్న హాస్టల్ వార్డెన్తో పాటు మరొకరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మొత్తం సంఘటనపై క్షుణ్ణంగా విచారణ చేయాలంటూ పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ సిద్దార్థ జైన్ ఆదేశించారు.

మరిన్ని వార్తలు