కెవ్వు.. కెవ్వు.. కేక

22 Feb, 2014 02:07 IST|Sakshi
కెవ్వు.. కెవ్వు.. కేక

కెవ్వు.. కెవ్వు.. కేక
 
 సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థినుల కేరింతలు, తుళ్లింతలతో కళాశాల ప్రాంగణం కోలాహలంగా మారింది. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు సినీ గీతాలకు అనుగుణంగా చేసిన నృత్యాలు కేక పుట్టించాయి.
 
  సమ్యక్ - 2014 సందర్భంగా శుక్రవారం రాత్రి  సాంస్కృతిక ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన లేజర్ షో విద్యార్థుల కేరింతలతో మార్మోగింది. రంగు రంగుల లేజర్ కిరణాలు ముఖాలను తాకుతుంటే విద్యార్థులు, ఆహూతులు సైతం సంభ్రమాశ్చర్యాలతో పులకించిపోయారు.
 
 ఢిల్లీ నుంచి వచ్చిన డీసీడీఎస్ బృందం నృత్యాలు, లేజర్ షోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హిందీ పాటలు, వెస్ట్రన్ సాంగ్స్‌కు అనుగుణంగా డాన్సర్ల నృత్యాలు, భరతనాట్యం, కూచిపూడి నృత్యప్రదర్శనలు అలరించాయి. ఈ కార్యక్రమం ఆద్యంతం ఆహ్లాదకరంగా కొనసాగింది.

మరిన్ని వార్తలు