13 మంది ఖైదీలకు క్షమాభిక్ష

9 Jun, 2018 11:32 IST|Sakshi
విశాఖ కేంద్ర కారాగారం

ఆరిలోవ(విశాఖ తూర్పు): విశాఖ కేంద్ర కారాగారం నుంచి 13 మంది జీవిత ఖైదీలు బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టనున్నారు. వీరంతా క్షమాభిక్షపై కొద్ది రోజుల్లో విడుదల కానున్నారు. ఈ మేరకు రాష్ట్ర జైళ్ల శాఖ ఉన్నతాధికారుల నుంచి శుక్రవారం సాయంత్రం విశాఖ కేంద్రకారాగారం అధికారులకు ఉత్తర్వులు అందాయి.

ఈ ఉత్తర్వుల ప్రకారం ఇక్కడి నుంచి 13 మంది జీవిత ఖైదీలు విడుదల కానున్నారని జైల్‌ సూపరింటెండెంట్‌ ఎస్‌.రాహుల్‌ తెలిపారు. వీరిలో ఒకరు మహిళ ఉన్నట్లు చెప్పారు. అయితే వీరిని ఎప్పుడు విడుదల చేయాలో అనే తేదీ ఇంకా ప్రకటించలేదన్నారు. ఈ ఏడాది జనవరిలో క్షమాభిక్ష జీవో విడుదలైందన్నారు. దానిలో నిబంధనలు ప్రకారం సత్ప్రవర్తన కలిగిన 17 మంది ఖైదీలతో కూడిన జాబితాను జైల్‌ శాఖ ఉన్నతాధికారులకు పంపించామన్నారు. ఆ జాబితాను స్క్రూటినీ చేసిన అనంతరం వారిలో 13 మందిని అర్హులుగా గుర్తించారని చెప్పారు. ఎప్పటి నుంచో విడుదల కోసం ఎదురుచూస్తున్న ఈ ఖైదీలు బయట ప్రపంచంలోకి అడుగు పెట్టనుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు