అవినీతి పాలనకు చరమగీతం పాడాలి

27 Nov, 2018 12:09 IST|Sakshi
అంబాపురంలో మహిళలకు కరపత్రాలను అందజేస్తున్న యార్లగడ్డ వెంకట్రావు 

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావు

అంబాపురం గ్రామంలో ‘రావాలి జగన్‌ – కావాలి జగన్‌’

సాక్షి, అంబాపురం (విజయవాడ రూరల్‌): గన్నవరంలో నాలుగున్నరేళ్ళుగా కొనసాగుతున్న అవినీతి పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావు ప్రజలకు పిలుపునిచ్చారు. అంబాపురం గ్రామంలో సోమవారం ‘రావాలి జగన్‌ – కావాలి జగన్‌’ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి వెళ్లి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలు పథకానికి సంబంధించిన కరపత్రాలను ప్రజలకు అందజేసి వాటిని వివరించారు. అనంతరం వైఎస్‌ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గంలో చెరువుల్లో మట్టి, ఇసుక అక్రమ విక్రయాలతో అవినీతి పాలన జరుగుతుందని విమర్శించారు.

వచ్చే ఎన్నికల్లో ఆ దుష్ట పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నీతివంతమైన పాలన ప్రజలకు అందజేస్తుందని భరోసా ఇచ్చారు. సంపాదించుకునేందుకు తాను రాజకీయాల్లోకి రాలేదని, ప్రజలకు సేవ చేయడానికే వచ్చానని స్పష్టం చేశారు. కాగా, గ్రామానికి వచ్చిన వెంకట్రావుకు ఘన స్వాగతం పలికారు.

మహిళలు ఆయన రాక కోసం ఎదురుచూశారు. ఈ సందర్భంగా 25 మంది వైఎస్సార్‌ సీపీలో చేరారు. వారికి వెంకట్రావు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామ కన్వీనర్‌ నల్లమోతు చంద్రశేఖర్, కోకన్వీనర్‌ జోగా ప్రవీణ్, పార్టీ మండల కన్వీనర్‌ ఓంకార్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు యర్కారెడ్డి నాగిరెడ్డి, కోటగిరి వరప్రసాద్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రామిశెట్టి వెంకటేశ్వరరావు, వైఎస్సార్‌ సీపీ బీసీ అధ్యాయన కమిటీ సభ్యుడు, జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు బొమ్మిన శ్రీనివాసరావు, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి బడుగు శ్రీనివాసరావు, జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కైలే జోజి, ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శి తగరం కిరణ్, మాజీ ఎంపీపీ తోడేటి రూబేన్, మొగిలిచర్ల జోజిబాబు, గోపి, ఎన్‌.శ్రీను, మాదల నాని, బొంతు శ్రీనివాసరెడ్డి, అవుతు శివారెడ్డి, గొడ్డళ్ళ ఏడుకొండలు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు