గుర్తింపు లేని పాఠశాలల మూసివేత

8 Jun, 2015 01:03 IST|Sakshi

 ఏలూరు సిటీ : జిల్లాలో ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తోన్న ప్రైవేట్ పాఠశాలలను మూసివేస్తామని జిల్లా విద్యాధికారి డి.మధుసూదనరావు హెచ్చరించారు. జిల్లాలో విద్యాధికారులు గుర్తించిన విధంగా 10 ప్రైవేట్ పాఠశాలలకు అనుమతులు లేవన్నారు. ప్రభుత్వ అనుమతులు పొందేందుకు రెండు నెలల గడువు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేదని, ఈ పాఠశాలలపై విద్యా చట్టం మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
 
 గుర్తింపు లేని స్కూల్స్ ఇవే
 భీమడోలు మండలం పోతునూరులోని శ్రీ విద్యాలయం ఇంగ్లిష్ మీడియం స్కూల్, దెందులూరు మండలం సత్రంపాడులోని అరవింద విద్యా నికేతన్ ఇంగ్లిష్ మీడియం స్కూల్, ఏలూరు రూరల్ సత్రంపాడులోని అరవింద కాన్వెంట్, కృష్ణవేణి స్కూల్, నరసాపురంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్, పెరవలి వీఎం రంగా పబ్లిక్ స్కూల్, తణుకులోని సాయిజ్యోతి కాన్వెంట్, శ్రీ వెంకటేశ్వర విద్యానికేతన్, ప్రగతి విద్యానికేతన్, తాడేపల్లిగూడెంలోని సెయింట్ థెరిస్సా ఇంగ్లిష్ మీడియం స్కూల్స్‌కు ప్రభుత్వ అనుమతులు లేవు.
 
 15 వరకు పాఠశాలలు తెరిస్తే చర్యలు
 ఈ నెల 15 వరకు ప్రభుత్వ నిబంధనల మేరకు సెలవులుగా ప్రకటించామని, నిబంధనలు పాటించకుండా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని డీఈవో హెచ్చరించారు. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు తరగతులు నిర్వహిస్తున్నట్లు సమాచారం ఉందని, అలా ఏవైనా ఉంటే వాటిని మూసివేయించాలని మండల విద్యాధికారులను ఆదేశించారు.
 

మరిన్ని వార్తలు