ఆ రోజుల్లో అమరావతి డిక్లరేషన్‌: సీఎం

14 Jan, 2017 01:12 IST|Sakshi
ఆ రోజుల్లో అమరావతి డిక్లరేషన్‌: సీఎం

వాలంటీర్లుగా 15 వేల మంది విద్యార్థులు: కోడెల  

సాక్షి, అమరావతి: ఫిబ్రవరి 10వ తేదీ నుంచి మూడురోజులపాటు జరిగే జాతీయ మహిళా పార్లమెంటరీ సమావేశాల్లో అమరావతి డిక్లరేషన్‌ను ప్రకటిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. సదస్సుకు సన్నాహకంగా శుక్రవారం విజయవాడలోని ఒక హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. అమరావతి డిక్లరేషన్‌ను ప్రకటించడంతోపాటు దాన్ని ఎలా అమలు చేయాలనే దానిపై సదస్సులో చర్చిస్తామన్నారు.  సదస్సును ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించామని, ఆయన రాకపోతే రాష్ట్రపతి లేదా మరెవరితోనైనా ప్రారంభం చేయిస్తామని సీఎం చెప్పారు.

మహిళా సాధికారతకు దోహదం: కోడెల
శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ మహిళా సాధికారతకు మహిళా పార్లమెంటరీ సదస్సు ఉపయోగపడుతుందన్నారు. విజయవాడలోని వివిధ కళాశాలల్లో ఉన్న 15 వేలమంది విద్యార్థులు వాలంటీర్లుగా సదస్సులో పనిచేయనున్నారని తెలిపారు. స్థానిక సంస్థల మహిళలు, మహిళా మేయర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, 29 రాష్ట్రాల స్పీకర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొంటారన్నారు. ఆఫ్రికా, అమెరికా, బంగ్లాదేశ్, శ్రీలంక తదితర దేశాలనుంచి ప్రముఖ మహిళలు హాజరవుతారని చెప్పారు. చివరిరోజు మహిళా రన్‌ నిర్వహిస్తామన్నారు.

మరిన్ని వార్తలు