జీవనోపాధికి ఆంగ్లం.. ఉనికికి తెలుగు: సీఎం

30 Aug, 2016 00:57 IST|Sakshi

సాక్షి, అమరావతి: తెలుగు భాషను మర్చిపోయి ఇంగ్లిషును నేర్చుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జీవనోపాధి కోసం ఇంగ్లీషు నేర్చుకున్నా.. మన ఉనికి కోసం తెలుగును మరిచిపోకూడదని తల్లిదండ్రులు, పిల్లలకు సూచించారు. సోమవారం విజయవాడలో గిడుగు రామ్మూర్తి పంతులు 153వ జయంత్యుత్సవం సందర్భంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో బాబు పాల్గొన్నారు. ఇక నుంచి అన్ని పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు తెలుగును తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించారు. శంకుస్థాపన ఫలకాలు తెలుగులోనే ఉండాలని అధికారులను ఆదేశించారు.

 హాకీ క్రీడాకారిణికి రూ. 25 లక్షల చెక్కు
 రియో ఒలింపిక్స్ మహిళా హాకీ టీంలో సభ్యురాలుగా ఉన్న చిత్తూరు జిల్లాకు చెం దిన రజనిని బాబు సన్మానించారు. రూ. 25 లక్షల చెక్కుతో పాటు, 1,000 గజాల ఇంటి స్థలాన్ని ఇస్తున్నట్లు ప్రకటించారు.

>
మరిన్ని వార్తలు