ఏపీ సర్కారు మరో నిర్వాకం..!

26 Feb, 2018 12:36 IST|Sakshi

దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించిన చంద్రబాబు

సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌లో పెటుబడుల సంగతి ఏమోకానీ.. సీఐఐ సదస్సలో మాత్రం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భారీగానే ఖర్చుపెడుతోంది. పెట్టుబడులను ఆకర్శించడానికి జరగాల్సిన సమావేశం, విందులు వినోదాలకు వేదికగా నిలిచింది. వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం విశాఖలో భాగస్వామ్య పెట్టుబడుల సదస్సు జరుగుతోంది. ఈ సందర్భంగా విశాఖలో అత్యంత రద్దీగా ఉండే వుడా పార్క్‌కు సమీపంలోని ఎంజీఎం పార్క్‌లో శనివారం రాత్రి మందు, విందు ఏర్పాట్లు భారీగా జరిగాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి దగ్గరుండి ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

ఈ విందులో అతిథులను ఆకట్టుకోవడానికి ఆటపాటలను కుడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందుకోసం బాలీవుడ్‌ నుంచి నృత్యకారిణులు, పాప్‌ గాయకులను పిలిపించారు. అంతేకాదు వీటితో పాటు పలు విలాసవంతమైన ఏర్పాట్లను చేశారు. ఈ కార్యక్రమంలో అతిథులను అలరించే బాధ్యతను ఈ-ఫాక్టర్‌ అనే సంస్థకు అప్పగించారు. గత నాలుగేళ్లుగా లక్షల కోట్ల పెట్టుబడులంటూ బాకా మోగిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటి వరకూ సాధించింది ఏమీ లేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సమావేశాల్లో ఏపీకీ ఎంత మేరకు పెట్టుబడులు వస్తాయో తెలీదు కానీ ఈ సమావేశాల పేరుతో మాత్రం ప్రజాధనాన్ని యధేచ్ఛగా ఖర్చు చేయడంపై సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా