జిల్లాల కలెక్టర్లతో బాబు టెలికాన్ఫరెన్స్

4 Dec, 2015 11:53 IST|Sakshi

విజయవాడ: భారీవర్షం తాకిడి వున్న నాలుగు జిల్లాల కలెక్టర్లతో, మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు తగ్గుముఖం పట్టినందున వెంటనే చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో రిలీఫ్ డిస్ట్రిబ్యూషన్, పునరుద్ధరణ చర్యలను ముమ్మరం చేయాలని ఆయన ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. రహదారుల పునరుద్ధరణ, చెరువులు, కుంటలువంటి జలాశయాల సంరక్షణ తక్షణం చూడాలని కూడా ఆదేశాల్లో పేర్కొన్నారు.

కరువు, వరద సహాయ నిధులు సకాలంలో అందేలా కేంద్రంతో సంప్రదింపులు జరిపే బాధ్యతను ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రి పుల్లారావుకు ఆయన అప్పగించారు. ఇప్పటికే తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలలో 3.27 లక్షల టన్నుల ధాన్యం సేకరణ పూర్తయిందని ఈ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు వివరించారు. ఈ నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాలలో ధాన్యం కొనుగోలులో నిబంధనలు సడలించేలా ఎఫ్‌సీఐను ఆదేశించేలా కేంద్రంతో మాట్లాడాలని కంభంపాటి రామ్మోహనరావును ముఖ్యమంత్రి ఆదేశించారు.

>
మరిన్ని వార్తలు