డీఐజీపై సీఎం ఆగ్రహం

31 Mar, 2018 12:55 IST|Sakshi
డీఐజీని ప్రశ్నిస్తున్న సీఎం చంద్రబాబు

కడప అర్బన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనకు శుక్రవారం సాయంత్రం విచ్చేశా రు. ప్రత్యేక విమానంలో కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌కు సతీమణి భువనేశ్వరితోపాటు చేరుకున్నారు. ఒంటిమిట్ట రాములోరి కల్యాణోత్సవంలో పాల్గొనేందుకు ఆయన  వచ్చారు.ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లోకి అంతకుముందుగానే చేరుకున్న టీడీపీ నేతలు గోవర్దన్‌రెడ్డి, హరిప్రసాద్‌ సీఎం రాక కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ లింగారెడ్డితోపాటు కేంద్ర మాజీమంత్రి సాయిప్రతాప్‌ తన అల్లుడు నవీన్‌తో కలిసి ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌కు వచ్చారు. పోలీసులు వారిని లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదు. సీఎం చంద్రబాబు ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి చేరుకోగానే తమకు జరిగిన అవమానం గురించి ఏకరువు పెట్టుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు అక్కడే ఉన్న కడప, కర్నూలు రేంజ్‌ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పర్యటన దృష్ట్యా కడప నగరంలో దుకాణాలన్నీ మూసి వేయించి కర్ఫ్యూ వాతావరణాన్ని కల్పించినట్లుగా ఉందని, ఈ చర్య వల్ల తనకు మేలు జరుగుతుందా? కీడు జరుగుతుందా? అనే విషయాన్ని ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు