నవంబర్‌ 1న ముఖ్యమంత్రి రాక

29 Oct, 2018 07:54 IST|Sakshi

చెక్కుల పంపిణీ కోసం పలాసలో బహిరంగ సభ

కలెక్టర్‌ ధనంజయరెడ్డి

శ్రీకాకుళం పాతబస్టాండ్‌:  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవంబర్‌  1న శ్రీకాకుళం జిల్లాకు వస్తున్నారని కలెక్టర్‌ కె.ధనంజయరెడ్డి తెలిపారు. ఆదివారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సీఎం పర్యటనపై సమీక్షించా రు. అనంతరం మండల స్థాయి అధికారులతో టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిత్లీ తుఫాన్‌లో నష్టపోయిన బాధితులకు నష్ణపరిహారం పంపిణీ కార్యక్రమంలో భాగంగా పలాసలో బహిరంగ సభ ఉంటుందని చెప్పారు. అదే రోజు ఉదయం నుంచి ప్రతి మండలంలోనూ గ్రామ పంచాయితీ స్థాయిలో సంబంధిత అధికారులు బాధితులకు చెక్కులు పంపిణీ చేస్తారని తెలిపారు. సభా స్థలాన్ని పరిశీలించి ఏర్పాట్లు చేయాలని డీఆర్‌డీఏ పీడీ జి.సి.కిషోర్‌కుమార్, శ్రీకాకు ళం నగరపాలక సంస్థ కమిషనర్‌ ఆర్‌. శ్రీ రాములునాయుడులను కలెక్టర్‌ ఆదేశించారు.  ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు, కమిషనర్లు, డిప్యూటీ కలెక్టర్లు, తదితర ఉన్నతాధికారుల జాబితాలు తయారు చేయాలని, అం దరికీ సన్మానం ఉంటుందని జిల్లా రెవెన్యూ అధికారి కె.నరేంద్రప్రసాద్‌న్‌ ఆదేశించారు.

పక్కాగా వివరాల నమోదు..
నష్టపరిహారం పంపిణీ జాబితాలు పక్కాగా ఉండాలని, నిజమైన బాధితులకే పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. డేటా ఎంట్రీ సోమవారం ఉదయం నాటికి పూర్తిచేయాలన్నారు.
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తప్పులుగా నమోదుచేస్తే సంబంధిత ఎన్యూమరేటర్‌కు, వారికి సహకరించిన సిబ్బందికి జీతాల నుంచి రికవరీ చేస్తామన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 20,438 చెట్లను తొలగించినట్లు అగ్నిమాపకశాఖ అధికారి సీహెచ్‌ కృపావరం తెలిపారు.  సమావేశంలో డ్వామా పీడీ హెచ్‌.కూర్మారావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు