విభజన హామీల అమలును సమీక్షించండి

4 Nov, 2017 01:40 IST|Sakshi

     కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు సీఎం చంద్రబాబు వినతి

     ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతోనూ భేటీ

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా ఇచ్చిన హామీల అమలులో పురోగతిపై సమీక్ష జరపాలని సీఎం ఎన్‌.చంద్రబాబు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. ఆయన శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో రాజ్‌నాథ్‌సింగ్, ఆర్థికమం త్రి అరుణ్‌ జైట్లీలతో విడివిడిగా సమావేశమ య్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లా డారు. ‘‘రాష్ట్ర విభజన హేతుబద్ధంగా జరగలేదు. విభజన జరిగాక ఆంధ్రప్రదేశ్‌ అవతరణ ఎప్పుడు జరిగిందో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. విభజన తరువాత చేపట్టిన పనులు పూర్తి చేయాల్సిన అవసరముంది.

కేంద్రమంత్రుల పోర్ట్‌ఫోలియోలు మారినప్పుడు, అధికారులు మారినప్పుడు ఇబ్బందులొస్తున్నాయి. ఆర్థికశాఖ కార్యదర్శి మారారు. ఆయనతో మాట్లాడాం. జల వనరులశాఖ మంత్రి మారారు. ఆయనతోనూ మాట్లాడాం. ప్రస్తుతం ఆర్థికమంత్రి, హోంమం త్రిని కలసి విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని కోరా. ప్రత్యేక ప్యాకేజీగానీ, విభజన హామీలుగానీ అమలు కాలేదు. వీటిని అమలు చేయాలని ఆర్థికమంత్రిని కోరా. విభజన చట్టం తెచ్చిందే హోంశాఖ కాబట్టి రెండు రాష్ట్రాల మధ్య ఏం జరిగింది? కేంద్రం ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చిందో సమీక్ష చేసి న్యాయం చేయాలని హోంమంత్రిని కోరా. చేస్తానని హామీ ఇచ్చారు. అసెంబ్లీ సీట్ల పెంపు అంశాన్నీ గుర్తుచేశా ను. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాతో ఫోన్‌లో మాట్లాడాను. ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని ఆయన చెప్పారు...’’ అని సీఎం తెలిపారు.

పోలవరం పనులు వేగంగా జరగాలి
‘పోలవరం ప్రాజెక్టును వేగంగా అమలు చేయాల్సి న అవసరముంది. మొన్న ఏపీ కేబినెట్‌లోనూ దీనిపై సమగ్రంగా చర్చించాం. ఈ ప్రాజెక్టులో 60 సి నిబంధన కూడా ఉపయోగించుకోవాల్సి ఉందని నిర్ణయించాం. ఎట్టిపరిస్థితుల్లో ఈ ప్రాజెక్టును పూర్తిచేసుకునే బాధ్యత ప్రభుత్వంపై, ప్రజలపై ఉంది’’ అని చంద్రబాబు అన్నారు. అసెంబ్లీ సీట్ల పెంపుపై ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన చెప్పారు. చిన్నరాష్ట్రాల్లో రాజకీయ సుస్థిరతకోసం సీట్లపెంపు ఆవశ్యకతను వివరించానన్నారు. 

ఉప రాష్ట్రపతితో భేటీ..
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును ఆయన నివాసంలో సీఎం శుక్రవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

ఇకనుంచి ఫుడ్‌ ప్రాసెసింగ్‌పై దృష్టి: సీఎం 
ఇకపై తాను ఫుడ్‌ ప్రాసెసింగ్‌పై దృష్టి పెట్టనున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో శుక్ర వారం ఆరంభమైన వరల్డ్‌ ఫుడ్‌ ఇండి యా–2017 సదస్సులో ఏపీ నుంచి సీఎం చంద్రబాబుతోపాటు మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా శుక్రవారం మధ్యాహ్నం ఫుడ్‌ ప్రాసె సింగ్‌ రంగంలో ఏపీలో ఉన్న అవకాశాల్ని వివిధ సంస్థల ప్రతినిధులకు వివరించేందు కోసం విడిగా సెషన్‌ ఏర్పాటు చేశారు. వరల్డ్‌ ఫుడ్‌ ఇండియా సదస్సు సందర్భంగా సీఎం చంద్రబాబు పలు సంస్థల ప్రతినిధులతో సమావేశమై అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు.

మరిన్ని వార్తలు