దళితులకు సీఎం జగన్‌ పెద్దపీట

17 Jun, 2019 11:51 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న పార్టీ నియోజకవర్గ ఎస్సీసెల్‌ ఇన్‌చార్జ్‌ మెండెం ఆనంద్‌ 

సాక్షి, పెదవేగి రూరల్‌: దేశం అంతా రాష్ట్రం వైపు తొంగి చూసే విధంగా దళితులకు సీఎం పెద్ద పీట వేశారని వైసీపీ నియోజకవర్గ ఎస్సీసెల్‌ ఇన్‌చార్జ్‌ మెండెం ఆనంద్‌ అన్నారు. పెదవేగి మండలం దుగ్గిరాల్లో దళితజాతి ముద్దుబిడ్డ, బాపట్ల ఎంపీ నందిగాం సురేష్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం దుగ్గిరాల తన నివాసంలో గ్రామ ఎస్సీసెల్‌ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆనంద్‌ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ సరికొత్త రాజకీయ చరిత్రకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒక దృఢ సంకల్పంతో శ్రీకారం చుట్టారన్నారు.

రాష్ట్రంలో సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో చరిత్ర సృష్టించారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విప్లవం సృష్టిస్తూ నవయుగానికి నాంది పలికారని, ఎస్సీలకు రాజకీయంగా అత్యున్నత గుర్తింపునిస్తూ ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టడం, అంతేకాకుండా ఏకంగా ఐదు మంత్రి పదవులను కేటాయించడం ద్వారా ఎస్సీ వర్గాలకు తాను ఎంతటి ప్రాధాన్యమిస్తున్నారో చేతల్లోనే చూపించారని తెలిపారు. సమావేశంలో స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు దాసరి తంబి, పెదవర్తి చిన్న, పులవర్తి యాకోబు, సంజీవరావు, కొత్తపల్లి బాబి, తలారి దాసు, మెండెం జోసఫ్‌ పాల్గొన్నారు. 


 

>
మరిన్ని వార్తలు