యూనిఫామ్స్‌లో అవినీతి; విచారణకు సీఎం ఆదేశాలు

30 Aug, 2019 10:19 IST|Sakshi

వచ్చే ఏడాది నుంచి స్కూళ్లు తెరిచే సరికే యూనిఫామ్స్‌

ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాలు

సాక్షి, అమరావతి : గత టీడీపీ పాలనలో పచ్చ నాయకుల అవినీతికి అడ్డులేకుండా పోయింది. అసలే సర్కారీ బడుల్లో పిల్లల్ని చేర్చేందుకు తల్లిదండ్రులు వెనకడుగేస్తున్న వేళ.. విద్యార్థుల యూనిఫామ్స్‌ పంపిణీలో అవినీతికి పాల్పడ్డారు. ఆప్కో పేరుతో యూనిఫామ్స్‌ సరఫరాలో టీడీపీ నేతల అవినీతి బాగోతాన్ని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన చర్యలు చేపట్టారు. స్కూల్‌ యూనిఫామ్స్‌లో అవినీతిపై విజిలెన్స్‌ విచారణకు ఆదేశించారు. గత ఐదేళ్లలో యూనిఫామ్స్‌ పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విజిలెన్స్‌ అధికారులకు స్పష్టం చేశారు. వచ్చే ఏడాది నుంచి స్కూళ్లు తెరిచేసరికే యూనిఫామ్స్‌ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

మరిన్ని వార్తలు