‘కిలిమంజారో’పై సీఎం జగన్‌ ఫొటో ప్రదర్శన

27 Jan, 2020 05:51 IST|Sakshi
కిలి మంజారో పర్వత శిఖరంపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఫొటోను ప్రదర్శిస్తున్న శంకరయ్య

అభిమానాన్ని చాటుకున్న చిల్డ్రన్‌ స్పేస్‌ క్లబ్‌ సభ్యుడు శంకరయ్య 

ఆయనతో పాటు పర్వతారోహణ చేసిన డిగ్రీ విద్యార్థి ఈశ్వరయ్య 

గుంటూరు ఎడ్యుకేషన్‌: గుంటూరులోని చిల్డ్రన్‌ స్పేస్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా సభ్యులైన కె.శంకరయ్య, శీలం ఈశ్వరయ్య టాంజానియా దేశంలో ప్రపంచంలోనే అత్యంత రెండో ఎత్తయిన కిలిమంజారో మంచు పర్వత శిఖరాన్ని అధిరోహించారు. ఈ నెల 17న హైదరాబాద్‌ నుంచి టాంజానియా బయలుదేరిన వారు 23వ తేదీ ఉదయం 10 గంటలకు ఈ ఘనత సాధించారని క్లబ్‌ కార్యదర్శి జి.శాంతమూర్తి శనివారం గుంటూరులో వెల్లడించారు.

కిలిమంజారో పర్వతంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోటోను ప్రదర్శించి శంకరయ్య తన అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే జాతీయ జెండాను సైతం ఎగురవేశారు. అనంతపురం జిల్లాలోని ఆర్‌డీటీ స్వచ్ఛంద సంస్థలో శంకరయ్య స్పోర్ట్స్‌ కోచ్‌గా పని చేస్తున్నారు. గుంటూరు జిల్లా మాచర్ల ప్రాంతంలోని మారుమూల తండా దాపుపల్లికి చెందిన శీలం ఈశ్వరయ్య డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. 
 

మరిన్ని వార్తలు