పింగళి వెంకయ్యను స్మరించుకున్న సీఎం జగన్‌

2 Aug, 2019 12:23 IST|Sakshi

సాక్షి, అమరావతి : భారత జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళి అర్పించారు. ‘మన రాష్ట్రంలో జన్మించిన గొప్ప వ్యక్తి. స్వాతంత్ర్య సమరయోధుడు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఆయన చేసిన కృషి మరువలేనిది. అదే ఆయనను అజరామరుడిని చేసింది’ అని గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు సీఎం ట్వీట్‌ చేశారు.

జాతిపిత మహాత్మాగాంధీ సమకాలికుల్లో ఒకరైన పింగళి వెంకయ్య 1876, ఆగస్టు 2న కృష్ణా జిల్లా, భట్ల పెనుమర్రులో జన్మించారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో ఎన్నో పతాకాలు వినియోగించినప్పటికీ.. పింగళి రూపొందించిన పతాకాన్ని జాతీయ పతాకంగా గుర్తిస్తూ మహాత్మాగాంధీ అధ్యక్షతన విజయవాడలో జరిగిన కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. ఆ తర్వాత ఈ పతాకానికి కొద్దిగా మార్పులు చేశారు. గాంధీ సూచన మేరకు దానిపై 'రాట్నం' గుర్తు చేర్చారు. స్వాతంత్య్రానంతరం నాటి ప్రధాని నెహ్రూ సూచనమేరకు రాట్నం స్థానంలో అశోకచక్రం చేర్చారు. 

మరిన్ని వార్తలు