రేపు విజయవాడకు సీఎం జగన్‌

4 Sep, 2019 20:59 IST|Sakshi

విజయవాడ గురుపూజోత్సవంలో పాల్గొననున్న సీఎం జగన్‌

సాక్షి, అమరావతి : ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రేపు(సెప్టెంబర్‌ 5) విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొననున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు విజయవాడలోని మున్సిపల్‌ ఎంప్లాయీస్‌ కాలనీలోని ఏ ప్లస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరుగనున్న గురుపూజోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్‌ పాల్గొని  ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందిస్తారు. రాష్ట్రంలో ఉత్తమ సెవలందించిన గురువులకు ప్రభుత్వం ఈ పురస్కారాలను ప్రధానం చేయనుంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా