భారతీయులుగా పోరాడదాం

5 Apr, 2020 02:25 IST|Sakshi

కరోనా కాటుకు మతం లేదు..

యుద్ధంలో మన ప్రత్యర్థి కరోనాయే

ఐక్యంగా నిలబడాల్సిన సమయమిది

ఢిల్లీ ఆధ్యాత్మిక సమావేశంలో జరిగినదానికి మతాన్ని ఆపాదించొద్దు

ప్రధాని పిలుపుమేరకు నేటి రాత్రి 9 గంటలకు దీపాలు వెలిగించి వెలుగు సందేశాన్ని ఇద్దాం

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంలో మనందరి ప్రత్యర్థి కరోనా మహమ్మారే అని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. కుల మతాలకు అతీతంగా అందరూ కలసికట్టుగా నిలబడాల్సిన సమయం ఇదని, భారతీయులుగా పోరాటం చేద్దామని ప్రజలకు పిలుపు నిచ్చారు. ఢిల్లీలో ఆధ్యాత్మిక సమావేశానికి హాజరైన విదేశీ ప్రతినిధుల్లో కొందరికి కరోనా ఉండటం, వారి ద్వారా మనవారికి కూడా ఈ వైరస్‌ సోకడం దురదృష్ట్టకరమైన పరిణామమని, అయితే దీనికి మతాన్ని ఆపాదించడం, వారేదో కావాలని నేరం చేసినట్లుగా చూపడం ఏమాత్రం సరికాదని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ పిలుపుమేరకు ఆదివారం రాత్రి 9 గంటలకు రాష్ట్రంలో అందరూ దీపాలు వెలిగించి కరోనాపై పోరాటానికి సంఘీభావం తెలపాలని కోరారు. కరోనా కలకలం, లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో శనివారం సాయంత్రం 5 గంటలకు తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో ద్వారా ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్ర ప్రజలకు సందేశం ఇచ్చారు. ఆ వివరాలు ఇవీ..

అలాంటివి ఎక్కడైనా జరగవచ్చు..
– ఇలాంటి సంఘటన ఏ మతానికి సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలోనైనా జరగవచ్చు. మన దేశంలో అనేకమంది ఆధ్యాత్మిక వేత్తలున్నారు. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా వేలు, లక్షల సంఖ్యలో భక్తులున్న అనేకమంది పెద్దలు అన్ని మతాల్లోనూ ఉన్నారు. రవిశంకర్‌ ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ గానీ, జగ్గీవాసుదేవ్‌ ఈషా పౌండేషన్‌లో గానీ, మాతా అమృతానందమయి సభల్లో గానీ లేదా పాల్‌ దినకరన్‌ ఆధ్యాత్మిక కార్యక్రమంలో గానీ, జాన్‌ వెస్లీ ఆధ్యాత్మిక కార్యక్రమంలో గానీ ఎవరైనా పాల్గొనవచ్చు. ఎవరికైనా ఈ పరిస్థ్దితి రావచ్చు. ఇది ఎక్కడైనా జరగవచ్చు. ఎక్కడ జరిగినా అదొక ఉదేశపూర్వకంగా జరిగిన సంఘటనగా కాకుండా దురదృష్టకర సంఘటనగానే చూడాలే తప్ప, ఓ మతానికో, కులానికో ఆపాదించి వారేదో తప్పుచేసినట్టుగా, నేరం చేసినట్లుగా, కావాలని చేసినట్లుగా చూపడం, చూపే ప్రయత్నం ఎవరూ చేయకూడదు. అలాంటి ప్రయత్నాలు అత్యంత దురదృష్టకరం. అలాంటి ప్రయత్నాలు మనమంతా ఒక్కటిగా ఉన్నామని చెప్పేందుకు దోహదం చేయవు. 

మన ఐక్యతను చాటుదాం...
– కరోనా కాటుకు మందు లేదు. కరోనా కాటుకు మతాల్లేవు.  కరోనా కాటుకు ధనిక, పేద అనే తేడా లేదు. కరోనా కాటుకు దేశాలు అనే తేడా కూడా లేదు. ఈ యుద్ధంలో మన ప్రత్యర్ధి కంటికి కనిపించని కరోనా వైరస్‌. దీనికి వ్యతిరేకంగా మనుషులుగా అంతా పోరాటం చేస్తున్నాం. గెలిచి తీరాల్సిన సమయం ఇది.  అందరం ఐక్యంగా ఉన్నామని దేశానికి, ప్రపంచానికి చాటిచెబుతాం. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు ఈ నెల 5వ తేదీన ఆదివారం రాత్రి 9 గంటలకు తొమ్మిది నిమిషాల పాటు మనమంతా వెలిగించే దీపాలు కులాలు, మతాలు, ప్రాంతాలు, రాష్ట్రాలు అనే సరిహద్దులు లేకుండా అందరం ఒక్కటే అనే సందేశాన్ని ఇవ్వాలి. చీకటిని నింపుతున్న కరోనా మీద దివ్వెలు, దీపాలు, కొవ్వొత్తులు, టార్చ్‌లు, సెల్‌ఫోన్‌ లైట్ల కాంతులు వెలుగుకు నిజమైన అర్ధం తేవాలి. ఈ సందేశాన్ని ఎలాంటి పరిస్ధితులో ఇస్తున్నామో ఇవాళ ఏ మీడియాలో చూసినా అందరికీ బోధపడుతుంది. 
 
మనసుకు కష్టమనిపించినా తప్పలేదు..
– కరోనాపై పోరాటంలో ముందు వరుసలో నిలిచి యుద్ధం  చేస్తున్న వైద్య, ఆరోగ్య, పోలీసు సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్, పంచాయితీరాజ్‌ శాఖలో పారిశుద్ధ్య కార్మికులకు అండగా నిలిచేందుకు మరో నిర్ణయం కూడా తీసుకున్నాం. ఈ నెలకు సంబంధించి వారికి పూర్తి జీతాలు ఎలాంటి వాయిదాలు లేకుండా చెల్లించాలని నిర్ణయించాం. మిగతా శాఖల్లో ఉన్న సిబ్బంది అందరితో సంప్రదించి వారిని ఒప్పించిన తరువాత మనసుకు కష్టమనిపించినా జీతాలు కాస్త వాయిదా వేసే నిర్ణయం తీసుకున్నాం.

మరిన్ని వార్తలు