నల్గొండ అత్యాచారాల ఘటనపై విచారణకు ఆదేశం

4 Jan, 2014 12:06 IST|Sakshi

నల్గొండ జిల్లాలోని  11 మంది గిరిజన బాలికలపై ట్యూటర్ అత్యాచార ఘటనపై సీఎం కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఆ ఘటనపై తక్షణం విచారణ జరపాలని నల్గొండ జిల్లా కలెక్టర్కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. సాధ్యమైనంత త్వరగా నివేదిక అందించాలని ఆయన ఆదేశాలలో పేర్కన్నారు.  నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాని ఆయన ఆ ఆదేశాలలో పేర్కొన్నారు.


నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలోని  తండాలో ఓ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆశ్రమంలో ఉంటున్న అభం శుభం తెలియని పదకొండేళ్లలోపు  11 మంది బాలికలపై ట్యూటర్ హరీష్ మూడు మాసాలుగా అత్యాచారం చేస్తున్నాడు. ఆ ఘటనపై ఓ బాలిక ఉపాధ్యాయుడి ఫిర్యాదు చేసింది. దాంతో ఆ ఘటన వెలుగులోకి వచ్చింది.

>
మరిన్ని వార్తలు