సీఎం రమేష్ అక్రమాలకు చెక్‌

4 Sep, 2019 07:31 IST|Sakshi
వీఎన్‌ పల్లెలో, పెండ్లిమర్రిలో అరకొరగా  తవ్వకాలు జరిపిన గాలేరు–నగరి కాలువ

గాలేరు–నగరి పనులకు రివర్స్‌ టెండర్‌

టీడీపీ హయాంలో పనులు దక్కించుకున్న సీఎం రమేష్‌ కంపెనీ

అంచనాలు పెంచుకుని అక్రమాలు

కాంట్రాక్టర్లు పోటీకి రాకుండా అడ్డుకుని పనులు జరిపించుకున్న వైనం

టెండర్లు రద్దు చేసిన జగన్‌ సర్కార్‌

ప్రజాధనం ఆదా కోసం రివర్స్‌ టెండరింగ్‌

గత ప్రభుత్వ హయాంలో భారీగా అంచనాలు పెంచుకొని గాలేరు–నగరి ఫేజ్‌–2 పనుల్లో  కోట్లలో లబ్ధి పొందాలనుకున్న సీఎం రమేష్‌ (రిత్విక్‌ కంపెనీ)కు ప్రస్తుత ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌తో అడ్డుకట్ట వేసింది. టీడీపీ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టి కాంట్రాక్టర్లు పోటీకి రాకుండారూ.794 కోట్ల గాలేరు–నగరి పనులను రిత్విక్‌ కంపెనీ అధిక రేట్లకు దక్కించుకుంది. పని కోసం సదరు కంపెనీ జలవనరుల శాఖ ఉన్నతాధికారులపై ఒత్తిడి పెట్టినట్లు సమాచారం. ఎన్నికల సమయంలో హడావుడిగా గత ప్రభుత్వం పనులను సీఎం రమేష్‌ కంపెనీకి కట్టబెట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అధిక రేట్లకు పనులు అప్పగించడంతో సుమారు రూ.80 కోట్ల మేర ప్రభుత్వ ధనం దుర్వినియోగమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం గాలేరు–నగరి టెండర్లను సమీక్షించింది. పనుల్లో అక్రమాలు జరిగినట్లు నిర్ధారించుకుంది. వెంటనే సదరు పని టెండర్లను రద్దు చేయాలని జలవనరులశాఖ అధికారులను ఆదేశించింది. ఈనెల మొదటి వారంలో టెండర్లు పిలిచి పనుల వేగవంతానికి సిద్ధమవుతోంది.

సాక్షి, కడప : జిల్లాలో గాలేరు–నగరి  పనులకు సంబంధించి రూ.795 కోట్లు పనులను గత ప్రభుత్వం ఎన్నికల చివరి నిమిషంలో అప్పటి టీడీపీ నేత సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్‌ కంపెనీకి కట్టబెట్టింది. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడడానికి వారం రోజులముందు పెంచిన అంచనా వ్యయంతో రెండు ప్యాకేజీల పనులకు అప్పటి ప్రభుత్వం టెండర్లు పిలిచింది. పనులు దక్కించుకునేందుకు సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్‌ ప్రాజెక్టు పావులు కదిపింది.  అప్పటి సీఎం చంద్రబాబు పేషీ నుంచి జలవనరులశాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చింది. అంతకుముందే టెండర్లలో పాల్గొనకుండా మిగిలిన కాంట్రాక్టర్లను సైతం బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి.

అప్పటి సీఎం సైతం జలవనరులశాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చి పనులను రిత్విక్‌కు కట్టబెట్టడంలో కీలక భూమిక పోషించారనే ఆరోపణలున్నాయి. అంతకుముందే గాలేరు–నగరిసుజలస్రవంతి  రెండోదశ మొదటి ప్యాకేజీ ప్రధాన కాలువ 32.64కిమీ నుంచి 66.150 కి మీ వరకూ తవ్వాల్సి ఉంది. 10 వేల కరాలకు నీళ్లదించే డిస్ట్రిబ్యూటరీల ఏర్పాటు పనుల్లో 2014 నాటికి ుూ.69.89 కోట్ల విలువైన పనులు మిగిలాయి. రెండవ ప్యాకేజీ ప్రధాన కాలువ 66.15 కిమీ నుండి 96.50 వరకూ తవ్వకం చేపట్టాల్సి ఉంది. 12 వేల ఎకరాల ఆయకట్టుకు  నీళ్లందించేలా డిస్ట్రిబ్యూటరీలు ఏర్పాటు చేయాలి. రూ.110 కోట్ల పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌ ను బెదిరించి ఒప్పందం రద్దుకు (ప్రీ–క్లోజర్‌) గత సర్కార్‌ దరఖాస్తు చేయించింది.

దీనిపై జలవనరుల శాఖతో ఆమోదముద్ర వేయించిన చంద్రబాబు 2018–19 ఎస్‌ఎస్‌ఆర్‌ (స్టాండర్డ్‌ షెడ్యూల్‌ రేట్స్‌) ఆధారంగా మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచారు. ఎన్నికల నోటిఫికేషన్‌ రెండు నెలల ముందు గాలేరు–నగరి రెండోదశ మొదటి ప్యాకేజీ పనులకు రూ. 391.31 కోట్లఅంచనాతో ప్రిబ్రవరి 11 ఎల్‌ఎస్‌(లంప్సమ్‌)–ఓపెన్‌ పద్ధతిలో గత ప్రభుత్వం టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఫిబ్రవరి 25న టెక్నికల్‌ బిడ్‌ తెరిచారు. రిత్విక్‌ ప్రాజెక్ట్, ఎన్‌సీసీ, ఎమ్మార్‌కేఆర్, ఆర్వీఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ షెడ్యూల్లు్న దాఖలు చేశాయి. ఇందులో ఎమ్మార్‌కేఆర్,ఆర్వీఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కు అర్హతలున్నా షెడ్యూళ్లపై అనర్హత వేటు వేశారు. కోటరీలోని ఎన్‌సీసీ, రిత్విక్‌ ప్రాజెక్ట్‌ కంటే  ఎక్కువ ధరకు షెడ్యూల్‌ దాఖలు చేసేలా పావులు కదిపారు. 

ఖజానాకు రూ. 54.74 కోట్లు మిగిలేవి
ఈ టెండర్ల వ్యవహారం కేసు కోర్టు విచారణలో ఉండగానే చంద్రబాబు ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు ఫిబ్రవరి, 26న ఫైనాన్స్‌ బిడ్‌ ఓపన్‌ చేశారు. సీఎం రమేష్‌ సంస్థ 3.99 శాతం, ఎక్సెస్‌ (406.73 కోట్లు), ఎన్‌సీసీ 4.65 శాతం ఎక్సెస్‌ 409.50 కోట్లకు టెండరు దాఖలు చేశారు.  వీటిని ప్రిబ్రవరి 28 సీవోటీ పరిశీలనకు పంపగా ఒత్తిళ్లకు తలొగ్గి అదే రోజు టెండర్‌ను  ఆమోదించారు. సాధారణ పరిస్థితుల్లో టెండర్‌ నిర్వహించి ఉంటే  కనీసం10 శాతం తక్కువకే పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు వచ్చేవారు. అప్పుడు ఖజానాకు రూ. 54.74 కోట్లు మిగిలేవి. ఇదే పద్ధతిలో రెండో ప్యాకేజీ పనులకు  రూ.343.52 కోట్ల అంచనాతో ఎల్‌ఎస్‌–ఓపెన్‌ విధానంతో నోటిఫికేషన్‌ జారీ చేయించి 4.76 శాతం  అధిక ధరలకు  సీఎం రమేష్‌ కు కట్టబెట్టారు. దీనివల్ల ఖజానాపై  ’ 50.70 కోట్ల భారం పడింది. 

ఇప్పుడు ప్రజాధనం ఆదా
రివర్స్‌ టెండరింగ్‌తో ప్రజాధనం ఆదా కానుంది. గాలేరు–నగరి పనులను జగన్‌ ప్రభుత్వం ఇటీవలనే సమీక్షించింది. గత ప్రభుత్వం నిర్వహించిన టెండర్లలో అక్రమాలు జరిగా యని నిర్దారణకు వచ్చింది. జలవనరుల శాఖ  ప్రత్యేఖ అధికారి ఆదిత్యానాథ్‌ దాస్‌ ఎన్నికల ముందు టెండర్ల ద్వారా అప్పగించిన గాలేరు–నగరి మొదటి, రెండు ప్యాకేజీల కాంట్రాక్ట్‌  ఒప్పందాలను రద్దు చేయాలని ఆదేశించారు. ఆ రెండు ప్యాకేజీలకు గతంలో నిర్ణయించిన అంచనా విలువనే కాంట్రాక్ట్‌ విలువగా నిర్ణయించి ఎక్కువ మంది కాంట్రాక్టర్లు పోటీ పడేలా  నిబంధనలు సడలించారు. రివర్స్‌ టెండరింగ్‌ నోటిఫికేషన్‌  జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్‌ మొదటి వారంలో గాలేరు–నగరి రెండు ప్యాకేజీలకు రివర్స్‌ టెండరింగ్‌ నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. దీనివల్ల భారీగా ప్రజాధనం ఆదా అవుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ప్యాకేజీ–1లో పనులు ఇలా
ప్యాకేజీ–1 పరిధిలో 66.15వ కిలోమీటరు యు.రాజుపాలెం (పెండ్లిమర్రి మండలం) నుండి 94.561 కిలోమీటరు గంగనపల్లె వరకు 28.4 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువ పనులు మిగిలి ఉన్నాయి. వీటితోపాటు 52 స్ట్రక్చర్లు, బ్రిడ్జిలు, యూటీ తదితర పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్యాకేజీ–2కు సంబంధించి 32.640 కిలోమీటరు సర్వేరాయసాగర్‌ నుండి 66.150 కిలోమీటరు నందిమండలం వరకు 33.510  కిలోమీటరు మేర ప్రధాన కాలువ ఉంది. ఈ పనుల్లో కొంతమేర అక్కడక్కడ గతంలోపనిచేసి ఉన్నారు. పాత అంచనాల ప్రకారం రూ.129.94  కోట్ల పనులకుగాను రూ.57.77 కోట్లు కాంట్రాక్టర్లు బిల్లులు చేసుకోగా, ఇంకా రూ.72.71 కోట్ల బ్యాలెన్స్‌ వర్క్‌ మిగిలి ఉంది. కొత్త అంచనాల ప్రకారం రూ. 391.13 కోట్లకు పనులు పెరిగాయి. ప్రస్తుతం ప్రధాన కాలువతోపాటు 70 స్ట్రక్చర్స్‌ నిర్మించాల్సి ఉండగా, వీటి పరిధిలో రెండు మాత్రమే నిర్మించారు. ఈ కాలువ పరిధిలో ముద్దనూరు, వీఎన్‌పల్లె, వేముల, ఎర్రగుంట్ల ప్రాంతాల్లో 10 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి రావాల్సి ఉంది.

మరిన్ని వార్తలు