చిన్నారి వైద్యానికి ముఖ్యమంత్రి భరోసా

4 Dec, 2019 05:10 IST|Sakshi

తక్షణమే వైద్యం అందించాలని ఆదేశాలు

సాక్షి, అమరావతి: కళ్లకు క్యాన్సర్‌ సోకి ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారి హేమ (4) ఉదంతంపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. మీడియాలో వచ్చిన కథనాలను చూసిన ఆయన వెంటనే హేమకు చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. చిన్నారి కుటుంబంతో మాట్లాడి వైద్యం కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకకు చెందిన చిన్నారి హేమ వైద్యానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని సీఎం తెలిపారు.

ఇలాంటి నిరుపేదలను పూర్తి స్థాయిలో ఆదుకోవడానికే ఆరోగ్యశ్రీలో భారీ సంస్కరణలకు తెరతీశామని పేర్కొన్నారు. గతంలోలా కాకుండా క్యాన్సర్‌ రోగులకు ఆరోగ్యశ్రీ కింద ఎలాంటి పరిమితి లేకుండా ఎన్ని విడతలైనా చికిత్స అందించాలన్నారు. ఇది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందన్నారు. ఈలోగా అత్యవసర కేసులు ఉంటే క్యాన్సర్‌ రోగులకు వెంటనే చికిత్సలు అందించాలని సూచించారు.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఒకే సిలిండర్‌ నుంచి ఆరుగురికి ఆక్సిజన్‌

చంద్రబాబువి చౌకబారు విమర్శలు

డయల్‌ 1902

నాట్య మయూరి అన్నపూర్ణాదేవి ఇకలేరు

ఉద్యాన పంటల రైతులను ఆదుకోండి

సినిమా

నా వంతు విరాళం సేకరిస్తున్నాను

బర్త్‌డేకి టైటిల్‌?

ఇంట్లోనే ఉందాం.... కరోనాను దేశం దాటిద్దాం

‘స్టార్‌ వార్స్‌’ నటుడు కరోనాతో మృతి

ఆర్జీవీ... ఓ రామబాణం

అందుకే తప్పుకున్నా