రాజ్‌భవన్‌లో ‘ఎట్‌హోం’ కార్యక్రమం

15 Aug, 2019 15:46 IST|Sakshi

సాక్షి, విజయవాడ: రాజ్‌భవన్‌లో గురువారం జరిగిన ఎట్‌ హోం కార్యక్రమంలో సందడి నెలకొంది.  స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఇవాళ మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో తేనీటి విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తొలిసారి ఏపీలో ఎట్‌ హోం కార్యక‍్రమం జరిగింది.  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, సామినేని ఉదయభాను, వసంతకృష్ణ ప్రసాద్‌, జోగి రమేష్‌, టీడీపీ నేతల కళా వెంకట్రావు, కనకమేడల రవీంద్ర, అశోక్‌ బాబు, బీజేపీ నేతల కన్నా లక్ష్మీనారాయణ, దిలీప్‌, అడపా నాగేంద్ర, చాగర్లమూడి గాయత్రి, సీపీఐ నేతలు రామకృష్ణ, జల్లి విల్సన్‌, పలువురు ఐపీఎస్‌, ఐఏఎస్‌ అధికారులు, నగర ప్రముఖులు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు