ఇంటర్‌ విద్యార్థులకు ఆల్‌ ది బెస్ట్‌: సీఎం జగన్‌

4 Mar, 2020 10:09 IST|Sakshi

సాక్షి, అమరావతి‌: ఇంటర్మీడియట్‌ పరీక్షలు రాసే విద్యార్థులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు.  ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా పరీక్షలు రాయాలని సూచించారు. కష్టపడి చదివితే... మంచి ఫలితాలు సాధించగలరని వారిలో స్ఫూర్తి నింపారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. కాగా రాష్ట్రంలో బుధవారం నుంచి ఇంటర్మీడియెట్‌ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 10,65,156 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. ఇందుకోసం 1,411 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.  (చదవండి: ఎన్పీఆర్‌పై సీఎం జగన్‌ ట్వీట్‌)

కేవలం అవే ముఖ్యం కాదు: కేటీఆర్‌
సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు బెస్ట్‌ విషెస్‌ తెలిపారు. పరీక్షలు, గ్రేడ్లు ముఖ్యమేనని.. అయితే అవే సర్వస్వం కాదన్నారు. ఒత్తిడికి లోను కాకుండా.. ఉత్తమ ప్రదర్శన కనబరచాలని పేర్కొన్నారు. ఇక విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సైతం ఇంటర్‌ విద్యార్థులకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలు రాయాలని సూచించారు. కాగా ఈనెల 4 నుంచి 23 వరకు తెలంగాణలో నిర్వహించే పరీక్షలకు ఇంటర్‌ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పరీక్షా సమయం కంటే నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని, విద్యార్థులు వీలైనంత ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించింది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు