బలిరెడ్డి సత్యారావుకు సీఎం జగన్‌ నివాళి

28 Sep, 2019 11:14 IST|Sakshi

సాక్షి, విశాఖ : మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ నేత బలిరెడ్డి సత్యారావు భౌతికకాయానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నివాళులు అర్పించారు. శనివారం ఉదయం మహారాణి పేటలో బలిరెడ్డి నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రి.... సత్యారావు భౌతికకాయానికి పూలమాల వేసి అంజలి ఘటించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. బలిరెడ్డి మృతి చోడవరం నియోజకవర్గానికి తీరని లోటు అని సీఎం జగన్‌ అభివర్ణించారు. ముఖ్యమంత్రితో పాటు వైఎస్సార్‌ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్‌, ధర్మాన కృష్ణదాస్‌, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్‌, పలువురు వైఎస్సార్‌ సీపీ పార్టీ నేతలు కూడా సత్యారావుకు నివాళి అర్పించారు. కాగా నిన్న సాయంత్రం వాకింగ్‌ చేస్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సత్యారావు మైక్యూర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే.

చదవండిరోడ్డు ప్రమాదంలో వైఎస్సార్‌సీపీ నేత సత్యారావు మృతి 

దివికేగిన దిగ్గజం.. రాజకీయ ప్రస్థానం 

మరిన్ని వార్తలు