సీఎం చొరవతో రూ.700 కోట్లతో అభివృద్ధి పనులు 

2 Nov, 2019 07:16 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య

ప్రభుత్వ పాఠశాలలకు ప్రత్యేక నిధులు 

సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య

సాక్షి, నాయుడుపేట టౌన్‌: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో సూళ్లూరుపేట నియోజకవర్గంలో వివిధ సంక్షేమ పతకాలతో సుమారు రూ.700 కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుటుడుతున్నట్లు సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పేర్కొన్నారు. నాయుడుపేట ఆర్‌అండ్‌బీ అతిథిగృహం వద్ద శుక్రవారం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. సీఎం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ నవరత్నాలతో అన్ని వర్గాల సంక్షేమానికి బాటలు వేస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తూ కార్పొరేట్‌కు దీటుగా మనబడి–నాడు నేడు పతకం కింద ప్రభుత్వ పాఠశాలలు అభివృధ్దికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. మొదట విడతగా ఒక్క సూళ్లూరుపేట నియోజకవర్గంలోనే సుమారు రూ..20 కోట్ల నిధులు మంజూరు చేస్తూ 150 పాఠశాలల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నట్లుగా తెలిపారు.

ఇందులో నాయుడుపేటలోని రెండు జెడ్పీ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలు, కోటపోలూరు, తడ, ఏకొల్లు ఉన్నత పాఠశాలు కూడా ఉన్నాయన్నారు. ఆగష్టు నుంచి పనులు సైతం ప్రారంభమవుతాయన్నారు. దొరవారిసత్రంలో కొత్తగా బాలుర రెసిడెన్షియల్‌ ఐటీఐ, బాలికల  రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. సూళ్లూరుపేటలో అద్దె భవనంలో ఉన్న ఈఎస్‌ఐ వైద్యశాలకు ప్రభుత్వ భవనం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా నాయుడుపేట మండలం బిరదవాడ జాతీయ రహదారి పక్కనే ఉన్న బాలికల గురుకులంలో ఇంటర్‌ నుంచి డిగ్రీ వరకు అప్‌గ్రెడ్‌ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇంకా నాయుడుపేటలో సీఎం ప్రత్యేక చొరవ చూపుతూ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్, రూ.50 కోట్లతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సారధ్యంలో సీ–పెట్‌ సెంటర్‌ సైతం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో రూ.100 కోట్లతో ఇరిగేషన్‌ కెనాల్‌ అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేసినట్లు వివరించారు.

ఇందులో విన్నమాల పంట కాలువ, నెర్రికాలువ, పాలచ్చూరు సిస్టమ్, పాములు కాలువ, కళంగి డ్రైయిన్ల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తాగునీటి అందించేందుకు విధంగా సుమారు రూ.400 కోట్లకు పైగా నిధులతో ప్రతి మండలంలో తాగునీటి పథకాలు ఏర్పాటుకు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని తెలిపారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నేరవేర్చందుకు ముఖ్యమంత్రి నిబద్ధతతో ముందుకు సాగుతున్నారన్నారు. ఎమ్మెల్యేతో పాటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తంబిరెడ్డి సుబ్రహ్మణ్యంరెడ్డి, షేక్‌ రఫీ, కామిరెడ్డి మోహన్‌రెడ్డి, దేవారెడ్డి విజయులురెడ్డి. పాదర్తి హరినాథ్‌రెడ్డి, ఒట్టూరు కిషోర్‌ యాదవ్, దేశిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, నాగిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, దొంతాల రాజశేఖర్‌రెడ్డి, చెవూరు చెంగయ్య ఉన్నారు. 

మరిన్ని వార్తలు