ఉద్యోగులకు సీఎం  వరాల జల్లు

9 Jun, 2019 11:02 IST|Sakshi

నెల్లూరు(పొగతోట): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు వరాల జల్లుకురిపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ (ఇంటెరిమ్‌ రిలీఫ్‌) ఇస్తామని సీఎం ప్రకటించారు. సీపీఎస్‌ రద్దు చేస్తామని ప్రకటించారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయడం, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతనాలు పెంచుతామని సీఎం ప్రకటించారు. సోమవారం అమరావతిలో జరిగే కేబినెట్‌లో 27 శాతం ఐఆర్, సీపీఎస్‌(కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌) రద్దుపై నిర్ణయం తీసుకుంటారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజుల వ్యవధిలోనే మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలు అమలు చేయడంతో ఉద్యోగుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. 27 శాతం ఐఆర్, సీపీఎస్‌ రద్దు, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయడం, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతనాల పెంపు, ఉద్యోగులందరికీ నివాసస్థలాలు కేటాయింపు అమలు చేస్తే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.

మేనిఫెస్టోలో ప్రకటించిన ఐదు అమలు చేస్తే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి 25 ఏళ్లపాటు తిరుగు ఉండబోదని ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్‌ సకాలంలో ప్రకటించలేదు. ప్రతి ఐదేళ్లకు ఐఆర్‌ ప్రకటించాల్సి ఉంది. టీడీపీ ప్రభుత్వం 2018 జూలై నుంచి ఐఆర్‌ అమలు చేయాల్సి ఉంది. 2019 సార్వత్రిక ఎన్నికలకు మూడు నెలల ముందు మాజీ సీఎం చంద్రబాబునాయుడు 20 శాతం ఐఆర్‌ ప్రకటించాడు. ప్రకటించిన 20 శాతం ఐఆర్‌ వచ్చే నెల నుంచి అమలు చేసేలా చర్యలు తీసుకున్నారు. నూతన సీఎం ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ ప్రకటించి అమలు చేసేలా నేడు కేబినెట్‌లో నిర్ణయం తీసుకోనున్నారు.

ఐదేళ్లుగా ఉద్యోగుల పోరాటం
సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయమని ఉద్యోగులు ఐదేళ్ల నుంచి పోరాటాలు చేస్తుంటే టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రోజుల వ్యవధిలోనే సీపీఎస్‌ రద్దుపై నిర్ణయం ప్రకటిస్తామని ఉద్యోగులకు తెలియజేశారు. ప్రభుత్వ శాఖల్లో వందల మంది ఉద్యోగులు ఏళ్ల తరబడి కాంట్రాక్‌Šట ఉద్యోగులకు పని చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వీలైనంత మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయడం, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతనాలు పెంచేలా నిర్ణయం తీసుకోనుంది. ప్రభుత్వ ఉద్యోగులందరికీ నివాస స్థలాలు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు