ఆర్థిక శాఖపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష

4 Jul, 2019 11:54 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు అజేయ్‌ కల్లం, రెవెన్యూ స్పెషల్‌ సెక్రటరీ సత్యనారాయణ, ఐఏఎస్‌ అధికారి ఎస్‌ఎస్‌ రావత్‌, ఉన్నతాధికారులు, ఆయా శాఖల కార్యదర్శులు హాజరు అయ్యారు. 2019-20 బడ్జెట్‌లో ఉండాల్సిన ప్రతిపాదనలపై సీఎం జగన్ ప్రధానంగా చర్చించనున్నారు.
 
కాగా ఈ నెల 11వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.12వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం తొలిసారిగా అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. మొత్తం 15 పనిదినాల పాటు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. బడ్జెట్‌లో నవరత్నాల అమలుకే పెట్టపీట వేయనున్నారు. ఇప్పటికే నవరత్నాల్లోని 60 శాతంపైగా అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన నవరత్నాల్లోని అంశాలన్నింటికీ బడ్జెట్‌లో తగిన కేటాయింపులు చేయనున్నారు.

మరిన్ని వార్తలు