మార్కెట్‌ చైర్మన్లలో సగం మహిళలకే

3 Oct, 2019 13:49 IST|Sakshi

కమిటీల్లో కూడా సగం మహిళలకే

అక్టోబరు చివరినాటికి భర్తీ

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు యాభై శాతం రిజర్వేషన్‌ కల్పించాలి

ఆరు నెలల్లోగా దళారి వ్యవస్తను నిర్మూలించాలి

మార్కెటింగ్, సహకార శాఖల సమీక్షలో సీఎం జగన్‌

సాక్షి, తాడేపల్లి : మార్కెట్‌ యార్డులకు వెంటనే కమిటీల నియామయం జరపాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. కమిటీలలో 50శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు రిజర్వేషన్‌ కల్పించాలని సూచించారు. గురువారం ఆయన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మార్కెటింగ్‌, సహకార శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం జగన్‌ పలు సూచనలు చేశారు. పంట ప్రారంభంలోనే మద్దతు ధర ప్రకటించాలని ఆదేశించారు. అక్టోబర్‌ చివరి వారంలోగా పప్పు ధాన్యాలకు మద్దతు ధర ప్రకటించాలన్నారు. నియోజకవర్గాల స్థాయిలో గోడౌన్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. అన్ని పంటలకు ఈనామ్‌ అమలు చేయాలన్నారు. ఆరు నెలల్లో దళారి వ్యవస్థను రూపుమాపాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు. 

సమీక్షలో చర్చించిన ముఖ్యాంశాలు : 

పంటలకు లభిస్తున్న ధరలు, మార్కెట్లపై నిరంతర సమాచారం

 • మూడు మార్గాల్లో వ్యవసాయ ఉత్పత్తులు, వాటికున్న డిమాండ్, వివిధ ప్రాంతాల్లో ధరలపై ఎప్పటికప్పుడు సమాచారం
 • ఇప్పుడున్న అగ్రికల్చర్‌ మార్కెట్‌ కమిటీలు, అగ్రివాచ్‌తో సహా మరో ఏజెన్సీ ఏర్పాటుకు గత సమీక్షలో సీఎం నిర్ణయం, దీనిపై ప్రతిపాదనలు వివరించిన అధికారులు 
 • వ్యవసాయ ఉత్పత్తుల భవిష్యత్‌ ధరలు, బిజినెస్‌ కన్సల్టెన్సీ, ధరల స్థిరీకరణ నిధి నిర్వహణ, వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువ జోడించడం ఈ ఏజెన్సీ విధులుగా ఉండాలని సీఎం దిశానిర్దేశం
 • నిపుణులను ఇందులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం

పప్పు ధాన్యాల కొనుగోళ్ల కోసం కేంద్రాలు

 • కొనుగోలు కేంద్రాలపై ఆరాతీసిన ముఖ్యమంత్రి
 • అన్ని పంటల వివరాలను ఆన్‌లైన్లో రైతులు నమోదు చేయించుకోవాలన్న అధికారులు
 • ఆరుతడి పంటలపై అక్టోబరు 10 నుంచి రైతులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్న అధికారులు
 • అక్టోబరు 15 నుంచి కొనుగోలు ప్రారంభిస్తామన్న అధికారులు

ధరల స్థిరీకరణ, మార్కెట్లో ప్రభుత్వ జోక్యం

 • 85 రైతు బజార్లలో రూ.25 లకే కిలో ఉల్లిపాయలు విక్రయించామన్న అధికారులు
 • 660 మెట్రిక్‌ టన్నులు వినియోగదారులకు ఇచ్చామన్న అధికారులు
 • రూ. 32 లకే కిలో ఉల్లి ధరను అదుపు చేయగలిగామన్న అధికారులు
 • మళ్లీ ధరలు పెరిగిన క్రమంలో ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్న అధికారులు
 • రాష్ట్రంలో ఇప్పుడు సరిపడా నిల్వలు ఉన్నాయా? లేదా? అని అధికారులను సీఎం జగన్‌ ఆరా తీయగా.. సరిపడా నిల్వలు ఉన్నాయని చెప్పిన అధికారులు
 • టమోటా రైతులను కూడా ఆదుకున్నామన్న అధికారులు
 • కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో మార్కెటింగ్‌ అవకాశాలు చూసి ఆమేరకు చర్యలు తీసుకున్నామన్న అధికారులు

చిరు ధాన్యాల హబ్‌ గా రాయలసీమ

 • రాయలసీమ ప్రాంతాన్ని మిల్లెట్స్‌ హబ్‌గా మార్చాలన్న సీఎం
 • 9 నెలలపాటు గ్రీన్‌ కవర్‌ ఉండేలా చూడాలన్న సీఎం
 • మిల్లెట్స్‌ బోర్డులో కూడా నిపుణులకు పెద్దపీట వేయాలని ఆదేశించారు
 • వ్యవసాయ విధానాలు, మార్కెటింగ్, ప్రాససింగ్‌ అన్నీ బోర్డు పరిధిలో ఉంచాలని సీఎం ఆదేశించారు
 • మిల్సెట్స్‌ బోర్డు విధివిధానాలపై సమావేశంలో చర్చ, అక్టోబరు చివరినాటికి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్న సీఎం

పంటలు వేసేముందే.. ధరలప్రకటన

 • కందులు, మినుములు, పెసలు, శెనగలు, టమోటా, పత్తి పంటలకు భవిష్యత్తు ధరలు ఎలా ఉంటాయన్నదానిపై సమావేశంలో చర్చ
 • ధరల విషయంలో ప్రభుత్వం జోక్యంచేసుకున్న తర్వాత పరిస్థితి కచ్చితంగా మారాలన్న సీఎం
 • రైతులకు కచ్చితంగా భరోసా ఇచ్చామన్న నమ్మకం కలగాలన్న సీఎం
 • పంట వేసినప్పుడు వాటికి ధరలు ప్రకటించే పరిస్థితి ఉండాలన్న సీఎం జగన్‌ ఆదేశించారు. 
 • ఆ ధర ఏమాత్రం తగ్గుతున్నా.. ఆదుకోవడానికి తగిన ప్రణాళికలతో ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని సూచించారు
 • దళారీలకు పంటలను తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండకూడదన్న సీఎం
 • దళారులు లేకుండా వ్యవసాయ ఉత్పత్తులు విక్రయాలు జరగాలి
 • 6 నెలల్లోగా దళారీ వ్యవస్థను నిర్మూలించాలి, అధికారులు దీన్ని సవాల్‌గా తీసుకోవాలని సీఎం జగన్‌ సూచన
 • గ్రామ సచివాలయాల్లోనే ఈ క్రాప్‌ వివరాలు, ధరలు ప్రకటించాలన్న సీఎం
 • రైతులకు నేరుగా కాల్‌చేసి సహాయం అడిగే అవకాశం ఉండాలన్న సీఎం
 • దీనివల్ల ప్రైవేటు వ్యక్తులుకూడా మంచి ధరలకు రైతులనుంచి కొనుగోలుచేస్తారన్న సీఎం
 • ఇ–క్రాప్‌ నమోదుపై వాలంటీర్ల ద్వారా రైతులకు సమాచారం ఇవ్వాలన్న సీఎం
 • కనీస మద్దతు ధరలు లేని పంటలకూ ధరలు ప్రకటించాలన్న సీఎం
 • రైతుకు నష్టం రాకుండా ఉండేలా ఈధరలు నిర్ణయించాలన్న సీఎం
 • పంటల దిగుబడులు కూడా ఏస్థాయిలో ఉంటాయన్నదానిపై అంచనాలు రూపొందించాలన్న సీఎం

మార్కెట్‌ ఛైర్మన్లలో సగం పదవులు మహిళలకే

 • మార్కెట్‌ ఛైర్మన్లలో సగం మహిళలకే ఇవ్వాలని సీఎం ఆదేశం
 • కమిటీల్లో కూడా సగం మహిళలకే ఇవ్వాలని ఇదివరకే జీవో ఇచ్చామన్న సీఎం
 • అక్టోబరు చివరినాటికి భర్తీకి చర్యలు తీసుకోవాలన్న సీఎం

సహకార బ్యాంకులు, సహకార రంగం పటిష్టానికి చర్యలు

 • జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల నష్టాలపై ఒక కమిటీ వేయాలన్న సీఎం
 • వాటిని తిరిగి బలోపేతం చేయడంపై కార్యాచరణ ప్రణాళిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం
 • ప్రస్తుతం ఉన్న సమస్యలు, దీన్ని పరిష్కరించడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర ప్రణాళిక తయారుచేయాలన్న సీఎం
 • అవినీతి, పక్షపాతానికి తావులేని విధానం ఉండాలన్న సీఎం
 • సహకారరంగాన్ని పూర్తిస్థాయిలో పునర్‌వ్యవస్థీకరించాలన్న సీఎం
 • ఈ వ్యవస్థని బాగుచేయడానికి ఏంచేయాలో అదిచేద్దామన్న సీఎం
 • ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను కంప్యూటరీకరించే దిశగా చర్యలు తీసుకుంటామన్న సీఎం
 • ప్రతిష్టాత్మక సంస్థతో సమగ్ర పరిశీలన, అధ్యయనం చేయించాలన్న సీఎం
 • ఆప్కో పునరుద్ధరణ, బలోపేతంపైనకూడా అధ్యయనం చేయించాలని సీఎం ఆదేశం
 • నిర్ణీత కాలవ్యవధిలోగా ఈ ప్రక్రియ పూర్తికావాలన్న సీఎం
 • 6 నెలల్లో మొత్తం అధ్యయనం, సిఫార్సుల అమలు మొదలు కావాలన్న సీఎం
Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా