వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం

30 May, 2020 10:39 IST|Sakshi

ఏపీలో మారుతున్న వ్యవసాయ రంగం ముఖ చిత్రం

రైతు భరోసా కేంద్రాల నుంచే రైతులకు అన్ని వ్యవసాయ సేవలు

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రిగా పదవీ బాద్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ఏకకాలంలో 10,641 వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలను ఆన్‌లైన్‌ వీడియో ద్వారా వీక్షిస్తూ ఆరంభించారు. అంతకు ముందు సీఎం జగన్‌ను వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎమ్‌వీఎస్‌ నాగిరెడ్డి కండువా కప్పి అభినందనలు తెలిపారు. మొట్టమొదటగా కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండురంగపురం కేంద్రం ఆర్‌బీకేలో లభించే సేవలను పరిశీలించారు. (‘వైఎస్‌ జగన్‌ పాలన చరిత్రలో నిలిచిపోతుంది’)

సీఎం జగన్‌ రైతు పక్షపాతి: మంత్రి కన్నబాబు
అన్ని రంగాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రాధాన్యత ఇచ్చారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. కరోనా కష్టకాలంలోనూ సీఎం జగన్‌ ప్రతి హామీని నెరవేర్చారని, సంక్షేమ పథకాలను ఇంటి వద్దకే తీసుకెళ్లే చర్యలు తీసుకున్నారన్నారు. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసినందకు సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. రైతులే ఈ దేశానికి వెన్నుముక అని హరిత విప్లవ పితామహుడు ఎంఎస్‌ స్వామినాథన్‌ పేర్కొన్నారు. రైతుల కోసం ఏపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయన్నారు. (అందరూ నీలాగే మాట తప్పుతారని భావిస్తే ఎలా..?)

సీఎం యాప్‌ ప్రారంభం, ఆల్‌ది బెస్ట్
మార్కెట్‌ ఇంటెలిజెన్స్, పంటల కొనుగోలుకు సంబంధించిన సీఎం యాప్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. సీఎం యాప్‌ ప్రారంభం, ఆల్‌ది బెస్ట్‌ అంటూ విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్స్‌ అందరికీ ముఖ్యమంత్రి మెసేజ్‌ పంచించారు. దీని ద్వారా పంటల వివరాలను తెలుసుకునే అవకాశం ఉంది. కాగా రైతు భరోసా కేంద్రాల్లో ఒకేసారి 5 లక్షలమంది రైతులను ఉద్దేశించి సీఎం జగన్‌ లైవ్‌ వీడియో ద్వారా మాట్లాడుతున్నారు. అలాగే వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్‌ను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాల్‌ సెంటర్‌ నెంబర్‌ 155251 ద్వారా రైతులకు సలహాలు, సూచనలు అందించనుంది. రైతులకు శిక్షణా తరగతులు, విజ్ఞాన కేంద్రాలుగా రైతు భరోసా కేంద్రాలు తీర్చిదిద్దనున్నాయి.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు