వైఎస్సార్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్‌

8 Jul, 2020 12:51 IST|Sakshi

సాక్షి, ఇడుపులపాయ: ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ బుధవారం ఆవిష్కరించారు. అనంతరం రూ.190 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఆర్‌జీయుకేటీ, ఆర్‌కే వ్యాలీలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించడంలో భాగంగా రూ.139.83 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన కొత్త ఎకడమిక్ కాంప్లెక్స్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు.
(చదవండి: అమ్మ నాన్నను చూసిన విధానమే ఈ పుస్తకం: సీఎం జగన్‌)

  • 10.10 కోట్ల అంచనాతో  నిర్మించనున్న కంప్యూటర్ సెంటర్‌కు‌ సీఎం శంఖుస్థాపన చేశారు. ఇందులో  నాలుగు కంప్యూటర్ ల్యాబ్‌లు, రెండు లెక్చర్ హాళ్లు ఉంటాయి. 616 మంది కూర్చునే సామర్థ్యంతో  0.75 ఎకరాలలో విశాలమైన ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ ద్వారా కంప్యూటర్ సెంటర్ నిర్మాణం చేపట్టబోతున్నారు. 
  • 40 కోట్ల అంచనా వ్యయంతో అంతర్జాతీయ స్థాయిలో నిర్మించనున్న డాక్టర్‌ వైఎస్సార్‌ ఆడిటోరియానికి సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేశారు. ఇది రెండు అంతస్తుల ప్రపంచ స్థాయి ఆడిటోరియం. 1700 మంది విద్యార్థులకు సీటింగ్ సామర్థ్యం కలిగి ఉంటుంది. 6 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో మొత్తం ప్లిన్త్ ఏరియా 75,881.00 చదరపు అడుగులలో దీనిని నిర్మించనున్నారు. 
  • వీటితో పాటు 3 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ను సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. తద్వారా  విశ్వవిద్యాలయానికి ఏడాదికి 1.51 కోట్ల విద్యుత్ ఖర్చుని ఆదా చేయబోతున్నారు. 
  • అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం అనంతరం సీఎం వైఎస్‌ జగన్ ఇడుపులపాయల నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి ‌ చేరుకున్నారు. (చదవండి: ప్ర‌తి పేదోడి గుండెల్లో వైఎస్సార్ చిరంజీవుడే)
మరిన్ని వార్తలు