వన మహోత్సవాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌

31 Aug, 2019 10:57 IST|Sakshi

సాక్షి, అమరావతి : పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా అడవుల పెంపకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 70వ వన మహోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామంలో విద్యార్థులతో కలిసి సీఎం జగన్‌ మొక్కలు నాటారు. అనంతరం అటవీ శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శన శాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వన మహోత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 25 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది. శని వారం నుంచి నెల రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది.

మరిన్ని వార్తలు