నాడు వైఎస్సార్‌.... నేడు వైఎస్‌ జగన్‌

3 Jan, 2020 11:54 IST|Sakshi

పశ్చిమ గోదావరిలో ఆరోగ్యశ్రీ పైలట్‌ ప్రాజెక్టుకు శ్రీకారం

సాక్షి, ఏలూరు: ‘వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ’ పథకం పైలట్‌ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లాలో శ్రీకారం చుట్టారు. ఏలూరు ఇండోర్‌ స్టేడియంలో వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ పైలట్‌ ప్రాజెక్టును ఆయన శుక్రవారం ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ఆరోగ్యశ్రీ లబ్ధిదారులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. కాగా ఆరోగ్య శ్రీ పథకంలో ప్రస్తుతం 1,059 వ్యాధులకు చికిత్స అందిస్తుండగా.. అదనంగా మరో 1000 చేర్చి మొత్తం 2,059 వ్యాధులకు సేవలందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. అలాగే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించిన సీఎం జగన్‌ కంటి పరీక్షలు చేయించుకున్నారు. అం‍తకు ముందు ముఖ్యమంత్రి.. ఏలూరు మండలం వంగాయగూడెంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కాంస్య విగ్రహాన్ని సీఎం జగన్‌ ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు ఆళ్ల నాని, నారాయణ స్వామి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, గృహ నిర్మాణ శాఖా మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు, ఎంపీలు కోటగిరి శ్రీధర్‌, రఘురామకృష్ణమ రాజు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

ఫిబ్రవరి నుంచి క్యాన్సర్‌కు పూర్తి వైద‍్యం
కాగా ఈ ప్రాజెక్టు అమల్లో అనుభవాలు, ఇబ్బందుల్ని బేరీజు వేశాక రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ప్రతి నెలా ఒక్కో జిల్లాలో 2,059 రోగాలకు ఈ పథకాన్ని విస్తరిస్తూ వెళతారు. అప్పటి నుంచే ఆయా జిల్లాల్లో.. చికిత్స వ్యయం రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తించడం ప్రారంభమవుతుంది. అన్ని రకాల క్యాన్సర్లకూ ఈ పథకం వర్తించనుంది. 

నాడు వైఎస్సార్‌.... నేడు వైఎస్‌ జగన్‌
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కూడా ఆరోగ్యశ్రీ పథకాన్ని 2007 ఏప్రిల్‌ 1న ఏలూరు వేదికగా  ప్రారంభించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన ఈ పథకానికి జవసత్వాలు నింపి, వినూత్న మార్పులతో నేడు ఆయన కుమారుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇదే ఏలూరు వేదికపై నుంచే ప్రారంభించడం విశేషం.  

చదవండిఆరోగ్య ధీమా 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విద్యార్థులను చితకబాదిన ఉపాధ్యాయిని

సాయం అందేలోపే..మృత్యువు మింగేసింది!

రాంగ్‌ కాల్‌ రోమియోలు.. మెసేజ్‌లు, ఫొటోలు

వైఎస్సార్‌సీపీ నేత చిరంజీవి హత్యకు కుట్ర

క్యాన్సర్‌ రోగులకు ఉచిత వైద్య చికిత్స : సీఎం జగన్‌

వైద్య రంగానికి సీఎం జగన్‌ పెద్దపీట

ఆ ధైర్యం చంద్రబాబుకు ఉందా..?

నిరూపిస్తే క్షమాపణ.. రాజీనామా : ఆర్కే

తిరుమల లడ్డూపై వాట్సాప్‌లో దుష్ప్రచారం

అంపశయ్యపై నాన్న!

రాయపాటిపై ఈడీ కేసు నమోదు

‘క్రైం థ్రిల్లర్‌’లా ఉన్నతాధికారికి టోకరా!

కుంగిపోలేదు..స్ఫూర్తిగా నిలిచాడు..

మంగళగిరి ఎన్నారై కళాశాలలో కీచక ప్రొఫెసర్‌ అరెస్ట్‌

రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి..

నీరసిస్తున్న ‘స్వచ్ఛ’ దీక్ష

ఒక్కో పందెం కోడి ధర రూ.2 లక్షలు

నేటి ముఖ్యాంశాలు..

గవర్నర్‌తో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ

రాజధానిలో అక్రమాలకు ఆధారాలివిగో..

లంచం తీసుకోవాలంటే భయపడాలి

ఆరోగ్య ధీమా

బంగారు చీర కానుకపై సీబీఐ ఆరా!

ఏపీ దిశ చట్టం: ఇద్దరు స్పెషల్‌ ఆఫీసర్ల నియామకం

‘మూడు రాజధానుల’పై కిషన్‌రెడ్డి కామెంట్స్‌

‘అయిదేళ్లలో రూ. 5 వేల కోట్ల అప్పు’

ఈనాటి ముఖ్యాంశాలు

చంద్రబాబు జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి

అత్యాచారం చేసి ఆపై మర్మాంగం కోసేశాడు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అల.. వైకుంఠపురములో.. ‘దోశ స్టెప్పు’​

ఈ బాలీవుడ్‌ జంట ఏది చేసినా ప్రత్యేకమే!

అదంతా సహజం

ఇదే చివరి ముద్దు: నటి

శృతి కొత్త సంవత్సర తీర్మానం

మహిళలకు అంకితం